Breaking News

ఒక్క చిట్కాతో సిజేరియన్‌ తరువాత 15 కిలోలు తగ్గిన డాక్టర్‌

Published on Tue, 02/24/2026 - 10:41

పెళ్లి అయ్యేంతవరకు సన్నగా సన్నజాజితీగల్లా ఉన్న మహిళళు ప్రసవం తర్వాత బాగా బరువు  పెరుగుతారు. ఇలా పెరిగిన బరువు తగ్గడం అంటే అదో పెద్ద సవాల్‌. ఈ విషయంలో అందరి అనుభవాలు ఒకలాగా ఉండకపోవచ్చు. కానీ బిడ్డను సంరక్షించుకునే సమయంలో కొంత అశ్రద్ధ. నిజం చెప్పాలంటే మన గురించి మనం సమయాన్ని కేటాయించుకోవడం అసాధ్యం.  దీనికి తోడు హార్మోన్ల మార్పులు, నిద్ర లేమి బరువు పెరగడానికి మరింత ఆజ్యం పోస్తుంది. కానీ సరైన ప్రణాళిక , కృషి ఉంటే,  మద్దతు ఉంటే, తిరిగి పాత రూపానికి రావచ్చు అంటున్నారు డాక్టర్ అపరాజిత లంబా.  తాను C-సెక్షన్ (సిజేరియన్) తర్వాత 15 కిలోల బరువు తగ్గడానికి సహాయపడిన ఒక చిన్న మార్పు గురించి స్వయంగా ఆమె ఫ్యాన్స్‌తో పంచుకున్నారు.

ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో  చెప్పిన దాని   ప్రకారం టీకి బదులుగా బ్లాక్ కాఫీ తాగడం అలవాటు చేసుకోవడం వల్ల , సిజేరియన్  తరువాత పెరిగిన బరువును బాగా తగ్గించుకున్నారు. దాదాపు 15 కిలోల బరువు తగ్గించుకున్నారు. పైగా బ్లాక్‌ కాఫీ చర్మానికి, గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.  దీర్ఘాయువును ప్రోత్సహిస్తుందని తెలిపారు. బ్లాక్ కాఫీ మెటబాలిజం (Metabolism)ని మెరుగుపరుస్తుంది. కాఫీలో ఉండే కెఫిన్ (Caffeine) అనే పదార్థం శరీరంలోని  కొవ్వును తగ్గించి, శరీరానికి శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కెఫిన్ శరీరంలో సెన్సిటివ్ లిపోలిసిస్  బరువు తగ్గడంలో ఒక ముఖ్యమైన కారణం.


బ్లాక్ కాఫీ వల్ల కలిగే ప్రయోజనాలు:
చర్మ ఆరోగ్యం: బ్లాక్ కాఫీలో ఉండే పాలిఫెనాల్స్ ఆక్సీకరణ ఒత్తిడిని (oxidative stress) తగ్గించి, కొల్లాజెన్ విచ్ఛిన్నం కాకుండా కాపాడతాయి. దీనివల్ల ముడతలు తగ్గుతాయి. పరిమితంగా తీసుకుంటే మొటిమలు తగ్గడానికి, కళ్ల కింద నల్లటి వలయాలు, వాపును తగ్గిస్తుంది. అలాగే UV కిరణాల నుండి చర్మాన్ని రక్షించడానికి సహాయ పడుతుంది.

గుండె ఆరోగ్యం: మితంగా కాఫీ తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు మరియు స్ట్రోక్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఇది గుండె కణజాలాన్ని రక్షించడమే కాకుండా, శరీరంలో ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది.

దీర్ఘాయువు : కాఫీ మెటబాలిక్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. క్రమం తప్పకుండా బ్లాక్ కాఫీ తాగేవారిలో మరణాల రేటు తక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.

శారీరక పనితీరు: వర్కౌట్ చేయడానికి 30-60 నిమిషాల ముందు బ్లాక్ కాఫీ తాగడం వల్ల రక్తంలో అడ్రినాలిన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది శరీరాన్ని తీవ్రమైన వ్యాయామం చేయడానికి సిద్ధం చేస్తుంది.

బరువు నిర్వహణ: బ్లాక్ కాఫీలో కేలరీలు దాదాపు సున్నా. ఇది మీ జీవక్రియ రేటును (metabolic rate) 3-11శాతం పెంచుతుంది. శరీరంలో కొవ్వును సమర్థవంతంగా కరిగించడానికి సహాయ పడుతుంది. అలాగే, ఇది ఆకలిని నియంత్రించి అనవసరమైన కోరికలను (cravings) తగ్గిస్తుంది.

నోట్‌:  ఇది అవగాహనకోసం అందించిన సమాచారం మాత్రమే అని  గ్రహించగలరు.  బరువు తగ్గడం, పెరగడం అనేది వారి వారి శరీర తత్వం,  జీవనశైలి మీద ఆధారపడి ఉంటుంది. పౌష్టికాహారం, చిన్న పాటి వ్యాయామాలు, చక్కటినిద్ర మనసుకు, శరీరానికి ‍ప్రశాంతతనిస్తాయి.  ఇవి ప్రాథమికంగా బరువు నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)