Breaking News

డేరా బాబా కేసు.. పంజాబ్ హైకోర్టు సంచలన తీర్పు

Published on Sat, 03/07/2026 - 10:51

చండీగఢ్: డేరా సచ్ఛా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. రెండు దశాబ్దాల క్రితం జరిగిన జర్నలిస్టు రామ్ చందర్ ఛత్రపతి హత్య కేసులో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ పంజాబ్- హర్యానా హైకోర్టు శనివారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో గతంలో కింది కోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను హైకోర్టు రద్దు చేసింది. రామ్ రహీమ్ తరపు న్యాయవాది జితేందర్ ఖురానా ఈ విషయాన్ని వెల్లడించారు. 

2002లో హర్యానాకు చెందిన జర్నలిస్టు రామ్ చందర్ ఛత్రపతిపై కాల్పులు జరగడం, ఆపై చికిత్స పొందుతూ ఆయన మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. డేరా ఆశ్రమంలో జరిగే అకృత్యాలను వెలుగులోకి తెచ్చినందుకే ఆయనను హత్య చేశారనే ఆరోపణలు నాడు వినవచ్చాయి. ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు, 2019లో గుర్మీత్ రామ్ రహీమ్ సహా మరో ముగ్గురిని దోషులుగా నిర్ధారిస్తూ, యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ, డేరా బాబా హైకోర్టును ఆశ్రయించారు. శనివారం జరిగిన విచారణలో సాక్ష్యాధారాల లోపాన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ఆయనపై ఉన్న ఆరోపణలు నిరూపితం కాలేదని స్పష్టం చేస్తూ, కేసు నుంచి విముక్తి కల్పించింది.

ఈ హత్య కేసులో నిర్దోషిగా విడుదలైనప్పటికీ, రామ్ రహీమ్ సింగ్ ప్రస్తుతానికి జైలులోనే కొనసాగనున్నారు. తన ఆశ్రమంలోని ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో 2017లో ఆయనకు 20 ఏళ్ల కారాగార శిక్ష విధించారు. ప్రస్తుతం ఆయన హర్యానాలోని రోహ్‌తక్ జిల్లా సునారియా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. కాగా రామ్ రహీమ్ సింగ్‌కు హర్యానా ప్రభుత్వం పదే పదే పెరోల్ మంజూరు చేయడంపై గత కొంతకాలంగా తీవ్ర విమర్శలు వ్యుక్తమవుతున్నాయి. ఎన్నికల సమయంలోనే ఆయనకు పెరోల్ లభించడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని ప్రతిపక్షాలు, సిక్కు మత సంస్థలు ఆరోపించాయి. తాజా తీర్పుతో డేరా బాబా అనుచరులు హర్షం వ్యక్తం చేస్తుండగా జర్నలిస్టు ఛత్రపతి కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర నిరాశకు లోనయ్యారు. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ,  సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో వారు ఉన్నట్లు సమాచారం. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)