Breaking News

శృంగారానికి భార్య నిరాకరించడం క్రూరత్వమే 

Published on Sat, 07/19/2025 - 06:28

ముంబై:  భర్తతో శృంగారానికి భార్య నిరాకరించడం, అతడిని బహిరంగంగా అవమానించడం, మానసికంగా వేధించడం ముమ్మాటికీ క్రూరత్వమే అవుతుందని బాంబే హైకోర్టు తేల్చిచెప్పింది. ఇలాంటి సందర్భాల్లో భార్యతో విడాకులు తీసుకొనే హక్కు అతడికి ఉంటుందని స్పష్టంచేసింది. భార్య చేతిలో వేధింపులకు గురైన భర్తకు విడాకులు మంజూరు చేస్తూ పుణే ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమరి్థంచింది.

 పుణేకు చెందిన యువతీ, యువకుడు 2013లో పెళ్లి చేసుకున్నారు. 2014లో వారి మధ్య విభేదాలు మొదలయ్యాయి. తనకు విడాకులు మంజూరు చేయాలని కోరుతూ ఆ యువకుడు పుణే ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. భార్య తనతో శృంగారానికి ఒప్పుకోవడం లేదని, బంధువులు, స్నేహితుల ముందు అవమానిస్తోందని, దివ్యాంగురాలైన తన సోదరిని వేధిస్తోందని పేర్కొన్నాడు. 

అతడి వాదనను పరిగణనలోకి తీసుకున్న ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేస్తూ 2015లో ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ యువకుడి భార్య బాంబే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. తనకు విడాకులు అవసరం లేదని, భర్త నుంచి ప్రతినెలా రూ.లక్ష ఇప్పించాలని పేర్కొంది. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ రేవతి మోహితే, జస్టిస్‌ నీలా గోఖలేతో కూడిన బాంబే హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ విచారణ చేపట్టింది. భార్య పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది. బంధువులు, స్నేహితుల ముందు భర్తను అవమానించడం, అతడితో శృంగారానికి ఒప్పుకోకపోవడం, దివ్యాంగురాలైన సోదరిని వేధించడం వంటివి అతడిని మానసికంగా తీవ్ర అశాంతికి గురి చేశాయని పేర్కొంది. దంపతులు ఇక కలిసి ఉండేందుకు ఆస్కారం లేదని, వారికి విడాకులు మంజూరు చేయడం సమంజసమేనని తేల్చిచెప్పింది.   
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)