Breaking News

ఢిల్లీ అతలాకుతలం: భారీ పొగమంచు.. వణికించే చలి

Published on Tue, 12/30/2025 - 08:12

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని ఒకవైపు భారీ పొగమంచు కమ్మేయగా, మరోవైపు వణికించే చలి అందరినీ విలవిలలాడేలా చేస్తోంది. ఈరోజు (మంగళవారం) తెల్లవారుజామున నగరం మొత్తం దట్టమైన పొగమంచు ఆవరించింది. ఫలితంగా జనజీవనం తీవ్రంగా అతలాకుతలమవుతోంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాలకు శీతల గాలుల హెచ్చరికను జారీ చేసింది. పలు రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు.
 

ఢిల్లీలో దట్టమైన పొగమంచు కారణంగా దృశ్యమానత (Visibility) భారీగా పడిపోయింది. దీంతో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ)లో సుమారు 130కి పైగా విమానాలు రద్దయ్యాయి. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. రైల్వే శాఖ కూడా సుమారు 100కి పైగా రైళ్లు పొగమంచు కారణంగా  ఆలస్యంగా నడుస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీలోని పాలం, సఫ్దర్‌జంగ్ తదితర ప్రాంతాల్లో దృశ్యమానత కేవలం 50 మీటర్లకు పడిపోయింది.

ఒకవైపు ప్రమాదకర స్థాయికి చేరుకున్న కాలుష్యం, మరోవైపు విపరీతమైన చలి, ఇంకోవైపు దట్టమైన పొగమంచుతో ఢిల్లీలో వాయు నాణ్యత (ఏక్యూఐ) తీవ్రస్థాయికి చేరింది. పొగమంచు కారణంగా వాహనదారులు రోడ్లపై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. వృద్ధులు, శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్నవారు బయటకు రావద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, ప్రయాణికులు విమానాశ్రయం లేదా రైల్వే స్టేషన్‌కు బయలుదేరే ముందు తమ ప్రయాణ సమయాల అప్‌డేట్‌లను సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఐఎమ్‌డి అంచనా ప్రకారం రానున్న రెండు మూడు రోజుల పాటు ఈ పొగమంచు ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. వాహనదారులు ఫాగ్ లైట్లను ఉపయోగించాలని, అతివేగాన్ని తగ్గించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: Bangladesh: మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)