Breaking News

భారత్‌లో రష్యా వైన్‌ను ఎగబడి తాగుతున్నారు!

Published on Fri, 12/26/2025 - 05:21

ఢిల్లీ: ఇండియన్‌ మార్కెట్‌లో రష్యన్ వైన్‌కి ఊహించని స్థాయిలో ఆదరణ లభిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు యూరోపియన్ దేశాల వైన్‌ను సేవించే భారతీయులు ఇప్పుడు రష్యా వైన్‌ కోసం క్యూకడుతున్నట్లు పలు గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల విడుదలైన ఈ ఏడాది పది నెలల్లో వచ్చిన గణాంకాలు ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. 

వైన్ దిగుమతులలో రష్యా వాటా గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో, హై-ఎండ్ రెస్టారెంట్లు, లగ్జరీ హోటళ్లలో రష్యన్ వైన్ వినియోగం పెరుగుతోంది. భారత యువతలో వైన్ కల్చర్ పెరుగుతున్న నేపథ్యంలో, కొత్త రకాల రష్యన్ బ్రాండ్లు మార్కెట్‌లోకి ప్రవేశించడం ఈ వృద్ధికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

2025 జనవరి నుంచి అక్టోబర్ వరకు వచ్చిన డేటా ప్రకారం, రష్యన్ వైన్ దిగుమతులు గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు స్థాయికి చేరుకున్నాయి. ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల వైన్‌లతో పోటీ పడుతూ, రష్యన్ వైన్ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటోంది. భారత మార్కెట్‌లో ప్రీమియం సెగ్మెంట్‌లో రష్యన్ వైన్‌కి మంచి డిమాండ్ ఉంది. ధరలు తక్కువగా ఉండటం, కొత్త రుచులు అందించడం,మార్కెటింగ్‌తో పాటు ఇతర కారణాల వల్ల వినియోగదారులు ఆకర్షితులవుతున్నారు.

రష్యన్ వైన్‌కి భారత మార్కెట్‌లో పెరుగుతున్న డిమాండ్‌ వాణిజ్య సంబంధాలను మరింత బలపరుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. రష్యా–భారత్ మధ్య ఇప్పటికే ఎనర్జీ, డిఫెన్స్‌  రంగాల్లో ఉన్న సహకారం ఇప్పుడు ఫుడ్‌ అండ్‌ బేవరేజీస్‌ రంగంలో కూడా విస్తరిస్తోంది. ఈ వృద్ధి కేవలం వాణిజ్య పరిమితి కాకుండా, రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను కూడా బలపరుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

#

Tags : 1

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)