ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం
Breaking News
డెలివరీ బాయ్ వికృత చేష్టలు.. మహిళ ఇంట్లోకి చొరబడి..
Published on Sun, 07/12/2026 - 17:06
మెట్రో నగరాల్లో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. బెంగళూరులోని ఒక ఫ్లాట్లో ఒంటరిగా ఉన్న మహిళా పట్ల డెలివరీ బాయ్ హేయంగా ప్రవర్తించాడు. తన ఇంట్లోకి బలవంతంగా చొరబడి.. తన ముందు అసభ్యంగా ప్రవర్తించాడని నగరానికి చెందిన ఓ మహిళ సోషల్ మీడియా వేదికగా ఆరోపించింది. ఈ పోస్ట్కు స్పందించిన పోలీసులు.. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేశారు.
సదరు డెలివరీ బాయ్ ఒక పార్సిల్ డెలివరీ చేయడానికి తన ఇంటికి వచ్చాడని.. ఆ తర్వాత వాష్రూమ్ ఉపయోగించుకోవచ్చా అని అడిగాడని ఆ మహిళ పేర్కొంది. అయితే ఆమె నిరాకరించినప్పటికీ.. అతను బలవంతంగా ఇంట్లోకి చొరబడ్డాడని, వాష్రూమ్ నుండి బయటకు వస్తూ తన ప్రైవేట్ భాగాలను చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది.
"నేను మర్యాదపూర్వకంగానే పలుమార్లు నిరాకరించాను. అపరిచితులను నా ఫ్లాట్లోకి రానివ్వనని స్పష్టంగా చెప్పాను. అత్యవసరం అయితే పక్కింటి పురుషులను అడగాలని కూడా సూచించాను. నేను ఎన్నిసార్లు వద్దని చెప్పినా వినకుండా.. అతను తన చెప్పులు విప్పేసి.. నా అనుమతి లేకుండా బలవంతంగా నా ఇంట్లోకి చొరబడ్డాడని ఆమె తెలిపింది. ఈ ఘటనపై ఫ్లిప్కార్ట్ సంస్థ తీవ్రంగా స్పందించింది. కస్టమర్ల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ విషయం మా దృష్టికి వచ్చిన వెంటనే.. సదరు డెలివరీ బాయ్ను ఉద్యోగం నుంచి తొలగించామని పేర్కొంది.
Tags : 1