Breaking News

డీలిమిటేషన్‌ పిటిషన్‌ కొట్టివేత

Published on Sat, 07/26/2025 - 05:17

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రా­ల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచేలా నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్‌)కు కేంద్రాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. శుక్రవారం జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ ఎన్‌.కోటీశ్వర్‌ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ‘ఈ పిటిషన్‌లో చట్టబద్ధత ఏదీ కనబడలేదు. అందుకే దీన్ని డిస్మిస్‌ చేస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. 2014 నాటి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 26ను అమలు చేయాలని... దాని ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచేందుకు డీలిమిటేషన్‌ ప్రక్రియను కేంద్రం ప్రారంభించేలా ఆదేశించాలని ప్రొఫెసర్‌ కె. పురుషోత్తంరెడ్డి రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన జమ్మూ–కశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్వీభజన కోసం నోటిఫికేషన్‌ జారీ చేసిన కేంద్రం.. ఇదే విషయంలో ఏపీ, తెలంగాణను మినహాయించడం వివక్షేనని.. ఇది రాజ్యాంగ విరుద్ధమని పురుషోత్తంరెడ్డి పేర్కొన్నారు. అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం మాత్రం జమ్మూ–కశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతం కోసం జారీ చేసిన నియోజకవర్గాల పునర్వీభజన నోటిఫికేషన్‌ నుంచి ఏపీ, తెలంగాణను మినహాయించడం రాజ్యాంగబద్ధమేనని స్పష్టం చేసింది. 

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 170 (3)కి లోబడే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 26 ఉందని, దాని ప్రకారం 2026 తర్వాత నిర్వహించే తొలి జనాభా లెక్కల అనంతరమే నియోజకవర్గాల పునర్వీభజన ప్రక్రియను చేపట్టడం సాధ్యమవుతుందని తేల్చిచెప్పింది.  

అనుమతిస్తే ఇక పిటిషన్ల వరద: సుప్రీం ధర్మాసనం 
జమ్మూ–కశ్మీర్‌లో ఇప్పటికే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడంపై పిటిషనర్‌ చేసిన వివక్ష వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు మధ్య నియోజకవర్గాల పునర్విభజనలో వర్తించే నిబంధనలు వేర్వేరుగా ఉన్నాయని, అందుకే జమ్మూకశ్మీర్‌కు జారీ చేసిన నోటిఫికేషన్‌ను రాష్ట్రాల పరిస్థితులతో సరిపోల్చడం తగదని వ్యాఖ్యానించింది. ఇలాంటి విజ్ఞప్తులను స్వీకరిస్తే దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇలాంటి పిటిషన్లు వరదలా కోర్టులను ముంచెత్తే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. అలాంటి పరిణామాలకు తాము తలవంచలేమని జస్టిస్‌ సూర్యకాంత్‌ ధర్మాసనం స్పష్టం చేసింది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)