Breaking News

జనాభా ఆధారిత పునర్విభజనతో దక్షిణాదికి అన్యాయమే

Published on Sat, 05/10/2025 - 05:08

న్యూఢిల్లీ: జనాభా గణాంకాల ఆధారంగా పార్లమెంట్‌ నియోజకవర్గాల పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న వాదనను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.వి.నాగరత్న పరోక్షంగా సమరి్థంచారు. ఈ విషయంలో దక్షిణ భారత ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నట్లు గుర్తుచేశారు. సరోగసీ(క్రమబదీ్ధకరణ) చట్టానికి సంబంధించిన దాఖలైన పిటిషన్లపై న్యాయమూర్తులు జస్టిస్‌ బి.వి.నాగరత్న, జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. 

సరోగసీ ద్వారా రెండో సంతానం పొందడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఓ జంట ఈ పిటిషన్లు దాఖలు చేసింది. ఈ సందర్భంగా జస్టిస్‌ బి.వి.నాగరత్న స్పందిస్తూ... ‘‘దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గిపోతోంది. కుటుంబాలు కుదించుకుపోతున్నాయి. జననాల సంఖ్య నానాటికీ పడిపోతోంది. దక్షిణాదికి భిన్నంగా ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరిగిపోతోంది. పిల్లలను కంటూనే ఉన్నారు. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేస్తే తమకు అన్యాయం జరుగుతుందని దక్షిణాది ప్రజలకు భావిస్తున్నారు. 

పార్లమెంట్‌లో ఉత్తరాది ప్రాధాన్యం మరింత పెరుగుతుందని, దక్షిణాది వాటా తగ్గిపోతుందని ఆందోళన చెందుతున్నారు’’అని వివరించారు. ఇప్పటికే ఒక బిడ్డ ఉండగా, మరో బిడ్డ కోసం ఎందుకు ప్రయతి్నస్తున్నారని పిటిషనర్లను ప్రశ్నించారు. జనాభా తగ్గుదల వల్ల చైనాలో ఎన్నో ప్రతికూల పరిణామాలు సంభవిస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది చెప్పారు. అలాంటి పరిస్థితి మన దేశంలో రాదని జస్టిస్‌ నాగరత్న స్పష్టంచేశారు. ఉత్తరాదిలో జనాభా విపరీతంగా పెరుగుతోందని వెల్లడించారు. దేశ ప్రయోజనాల కోసం ఒక్క బిడ్డతో సరిపెట్టుకోవచ్చు కదా! అని పిటిషనర్లకు సూచించారు. విచారణను వాయిదా వేశారు.   
 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)