Breaking News

శీతాకాలం ఎఫెక్ట్‌: ‘ఇకపై 10కి ఆఫీసు’

Published on Sat, 11/08/2025 - 08:10

న్యూఢిల్లీ: ఒకవైపు వాయు కాలుష్యం, మరోవైపు శీతాకాలం.. దేశరాజధాని ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఢిల్లీ సర్కారు కాలుష్యాన్ని అదుపులో ఉంచేందుకు, ఇతర అవాంతరాలను నివారించేందుకు కసరత్తు ప్రారంభించింది.  ఇందులో భాగంగా ముందుగా ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది.

శీతాకాలం తన ప్రతాపం చూపుతుండటంతో ఢిల్లీలో గాలి నాణ్యత అంతకంతకూ తగ్గుతోంది. ఈ నేపధ్యంలో కాలుష్యానికి కారకమవుతున్న వాహన ఉద్గారాలను తగ్గించేందుకు ‍ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది.  ప్రభుత్వ కార్యాలయాలకు నూతన సమయాలను ప్రకటించింది. ఈ మేరకు నవంబర్ 15 నుండి ఢిల్లీలోని ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 6:30 గంటల వరకు పనిచేస్తాయని, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాలు ఉదయం 8:30 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు పనిచేస్తాయని ముఖ్యమంత్రి రేఖా గుప్తా  ప్రకటించారు.

ఈ మార్పులు 2026, ఫిబ్రవరి 15 వరకు అమలులో ఉంటాయని, రాజధానిలో వాయు కాలుష్యం గరిష్ట స్థాయికి చేరుకునే సమయంలో, దానిని అదుపులో ఉంచేందుకు ఈ సమయాలు ప్రవేశపెడుతున్నామని రేఖా గుప్తా తెలిపారు. ట్రాఫిక్ ఒకేసారి పెరగకుండా చూసుకోవడమే దీని ఉద్దేశ్యమని అన్నారు. కార్యాలయ సమయాలను మార్చడం ద్వారా, ట్రాఫిక్‌ ఇబ్బందులను నివారించవచ్చని, కాలుష్య స్థాయిలను తగ్గించవచ్చని ఆమె అన్నారు. ప్రస్తుతం ఢిల్లీలోని ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 9:30 గంటలకు, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాలు ఉదయం 9:00 గంటలకు ప్రారంభమవుతున్నాయి.

ఢిల్లీలో క్షీణిస్తున్న గాలి నాణ్యతపై ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ సీనియర్ అధికారుల మధ్య  సమావేశం జరిగిన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా శీతాకాలపు పొగమంచుకు వాహనాల ఉద్గారాలు తోడయినప్పుడు కాలుష్యం మరింత తీవ్ర స్థాయికి చేరుతుందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్‌ఈ) తెలిపింది. ఉదయం, సాయంత్రం రద్దీ సమయాలలో అత్యధిక కాలుష్యం వెలువడుతుతోందని సీఎస్‌ఈ గుర్తించింది.

ఇది కూడా చదవండి: ప్రియుడి కోసం భర్తకు ఊచకోత

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)