Breaking News

Delhi Woman's Death Case: వెలుగులోకి విస్తుపోయే నిజాలు

Published on Mon, 01/02/2023 - 12:42

ఢిల్లీలో 20 ఏళ్ల యువతిని కారుతో ఢీ కొట్టి ఈడ్చుకెళ్లిన దారుణ ఘటన యావత్తు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ అమానుష ఘటనపై అధికారులు సైతం దిగ్బ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు.. విచారణలో ప్రత్యక్ష సాక్షి చెబుతున్న విషయాలను విని ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. అలానే సీసీఫుటేజ్‌ దృశ్యాలు సైతం నివ్వెరపోయేలా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.

ఈ మేరకు ఈ ఘటననే చూసిన ప్రత్యక్ష సాక్షి దీపక్‌ దహియా మాట్లాడుతూ...ఈ ఘటన తెల్లవారుజామున 3.30 గంటలకు జరిగినట్లు తెలిపాడు. అతను తన మిఠాయి షాపు వద్ద ఉండగా.. సుమారు వంద మీటర్ల దూరంలో పెద్ద శబ్దం వచ్చింది. కారు టైరు పేలిందనుకున్నా.. కానీ కారు కదిలినప్పుడూ ఒక మృతదేహం కనిపించింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాను. తాను పెద్దగా అరుస్తూ వాహనాన్ని ఆపేందుకు మోటారు బైక్‌తో వెంబడించి యత్నించాను కానీ వారు వాహనాన్ని ఆపలేదు. సుమారు గంటన్నరపాటు ఆ యువతి మృతదేహాన్ని 20 కి.మీ దూరం ఈడ్చుకెళ్లారని తెలిపాడు.

వారు యూటర్న్‌ తీసుకుని పదే పదే డ్రైవింగ్‌ చేసుకుంటూ వెళ్లిపోయినట్లు వెల్లడించాడు. ఇది కేవలం ప్రమాదం కాదని దహియా నొక్కి చెప్పాడు. అంతేగాదు సుమారు గంటన్నర తర్వాత, కంఝవాలా రోడ్డులోని జ్యోతి గ్రామ సమీపంలో కారు నుంచి మృతదేహం వేరయ్యిందని, ఆ తర్వాత నిందితులు అక్కడ నుంచి పారిపోయారని చెప్పాడు. ఈ మేరకు ఢిల్లీ డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీసు హరేంద్ర కుమార్‌ సింగ్‌ మాట్లాడుతూ...కారు ఢీ కొట్టడంతో యువతి స్కూటీ నుంచి పడిపోయిందని, ఆ తర్వాత చాలా దూరం వరకు ఈడ్చుకెళ్లినట్లు తెలిపారు.

వాహనం రిజిస్టర్‌ నెంబర్‌ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. అలాగే వాహనం కిటికీలు మూసి ఉన్నాయి, పైగా సంగీతం బిగ్గరగా వస్తున్నందున్న తమకు ఏం జరిగిందో తెలియలేదని నిందితులు చెబుతున్నారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి పరారయ్యినట్లు పోలీసులకు తెలిపారు. ఆ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

(చదవండి: ఢిల్లీ ఘటనపై గవర్నర్‌ సక్సేనా ఫైర్‌: సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది)

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)