Breaking News

22న దీపకాంతులలో ఢిల్లీ ఆలయాలు

Published on Mon, 01/08/2024 - 08:46

జనవరి 22న అయోధ్యలో బాలరాముని విగ్రహ ‍ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా దేశరాజధాని ఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అన్ని దేవాలయాలను రంగురంగుల దీపాలతో, పూలతో అలంకరించనున్నారు. అంతే కాకుండా ఆలయాల్లో రామచరిత మానసను పారాయణం చేయడంతోపాటు రామచరిత మానస ప్రతులను పంపిణీ చేయనున్నారు. 

శ్రీ రాంలీలా మహాసంఘ్ నేతృత్వంలో ఢిల్లీలో 22న ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మహాసంఘ్‌ అధ్యక్షుడు అర్జున్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ 550 ఏళ్ల తర్వాత అయోధ్యలో శ్రీరాముని ఆరాధించే అవకాశం మనకు లభించబోతోందని అన్నారు. అందుకే ఆ రోజును చారిత్రాత్మకంగా మార్చేందుకు రామ్‌లీలా కమిటీలన్నీ తమ ప్రాంతాల్లోని ఆలయాలను రంగురంగుల దీపాలతో, పూలతో అలంకరించాలని నిర్ణయించాయన్నారు.

ఆలయాల వెలుపల పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్‌ల ద్వారా అయోధ్యలోని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రత్యక్షంగా ప్రదర్శించనున్నామన్నారు. అలాగే రామ్‌చరిత మానస కాపీలను రామ్‌లీలా కమిటీలు పంపిణీ చేస్తాయని తెలిపారు. ఆలయాల్లో 501 నెయ్యి దీపాలు వెలిగించనున్నారని తెలిపారు. ఈ నెల 22వ తేదీని దీపావళిలా జరుపుకోవాలని రాజధానివాసులకు శ్రీ రాంలీలా మహాసంఘ్ పిలుపునిచ్చింది. 

అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభం కానున్న సందర్భంగా సంపూర్ణ అనే సంస్థ ఆదివారం లోధీ గార్డెన్‌లో రాముని పెయింటింగ్ పోటీని నిర్వహించింది. దీనిలో పెద్ద సంఖ్యలో పిల్లలు, పెద్దలు పాల్గొన్నారు. సుమారు వంద మంది చిన్నారులు శ్రీరాముడు, ఇతర దేవతల వేషధారణలతో  కార్యక్రమానికి హాజరయ్యారు.

Videos

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

లక్ష్మణ్ తో BCCI కీలక మీటింగ్ టెన్షన్ లో గంభీర్, అగార్కర్

LIC కొత్త పాలసీ.. బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు

KA పాల్ బంపర్ ఆఫర్

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)