Breaking News

ఇంకా ఆందోళనకరంగానే పరిస్థితి!

Published on Mon, 12/23/2024 - 08:49

న్యూఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్యం తిరిగి ఆందోళనకర స్థాయికి చేరింది. కలుషిత గాలి కారణంగా జనం కళ్ల మంటలతో పాటు ఊపిరాడక ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచీ 450కి పైగా నమోదైంది. బవానాలో అత్యధిక ఏక్యూఐ స్థాయి 475 వద్ద నమోదైంది. ఇది చాలా తీవ్రమైన విభాగంలోకి వస్తుంది.

నిర్మాణ పనుల నిలిపివేత
డిసెంబర్ 16 నుంచి ఢిల్లీలో గ్రాప్‌ -4 నిబంధనలు అమలులో ఉన్నాయి. అయినప్పటికీ ఢిల్లీ గాలి నాణ్యతలో ఎలాంటి మెరుగుదల కనిపించడం లేదు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక 400 దాటింది. సొమవారం ఉదయం 6 గంటలకు ఢిల్లీలోని 25 కాలుష్య పర్యవేక్షణ కేంద్రాలలో గాలి నాణ్యత సూచిక 400 కంటే  అధికంగా నమోదైంది. గ్రాప్‌-4 నిబంధనల అమలుతో ఢిల్లీలో నిర్మాణ పనులను పూర్తిగా నిషేధించారు.  పాఠశాలలను కూడా హైబ్రిడ్‌ విధానంలో నడుపుతున్నారు.

ఏడు ప్రాంతాల్లో 450 దాటిన ఏక్యూఐ 
ఢిల్లీలోని బవానాలో 475, రోహిణిలో 468, వజీర్‌పూర్‌లో 464, అశోక్ విహార్‌లో 460, సోనియా విహార్‌లో 456, జహంగీర్‌పురిలో453గా ఏక్యూఐ స్థాయి నమోదయ్యింది. ఇది ఢిల్లీవాసులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు ఈరోజు(సోమవారం) ఢిల్లీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఢిల్లీలో కాలుష్యంతో పాటు చలి కూడా  అధికంగానే ఉంది. సోమవారం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెల్సియస్‌, గరిష్టంగా 20 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే మరో రెండు రోజుల పాటు ఢిల్లీలో దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. 

ఇది కూడా చదవండి: Year Ender 2024: కుటుంబం మెచ్చిన 10 అందమైన ప్రదేశాలు

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)