Breaking News

ఢిల్లీవాసుల హాహాకారాలు.. ఒకవైపు వాయు కాలుష్యం.. మరోవైపు నీటి ఎద్దడి

Published on Mon, 10/28/2024 - 10:39

న్యూఢిల్లీ: ఒకవైపు వాయు కాలుష్యం, మరోవైపు నీటి ఎద్దడి.. ఢిల్లీవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీపావళి సమీపిస్తున్న సమయంలో ఏర్పడిన ఇటువంటి పరిస్థితి అక్కడి ‍ప్రజల ఆనందాన్ని హరింపజేస్తోంది.

దేశరాజధాని ఢిల్లీలో ఇప్పటికే పటాసులు కాల్చడంపై నిషేధం కొనసాగుతుండగా, తాజాగా అక్టోబర్ 31 వరకు నీటి సరఫరా  అంతంతమాత్రంగానే ఉంటుందని ఢిల్లీ జల్ బోర్డు ప్రకటించడం ఆందోళనకరంగా మారింది. ఢిల్లీలో గాలి ఇప్పటికే పూర్‌ కేటగిరీలో ఉంది. పలు ప్రాంతాల్లో గాలినాణ్యత(ఏక్యూఐ) 400గా ఉంది. ఈ నేపధ్యంలో వాయు కాలుష్య నియంత్రణకు ‍ప్రభుత్వం పలు నిబంధనలు విధించే అవకాశం ఉంది.

అక్టోబర్ 31 వరకు ఢిల్లీలోని 60కి పైగా ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోనున్నదని ఢిల్లీ జల్ బోర్డు తెలిపింది. ఢిల్లీకి పలు వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నుంచి నీరు సరఫరా అవుతుంది. 110 ఎంజీడీ భార్గతి ప్లాంట్, 140 ఎంజీడీ సోనియా విహార్ ప్లాంట్‌కు నీరు ప్రధానంగా గంగా కెనాల్ నుండి వస్తుంది. యూపీ నీటిపారుదల బోర్డు దీనికి అక్టోబర్ 12 నుండి 31 వరకు  మరమ్మతు పనులు చేయనుంది.

ఈ కారణంగా ఈ ప్లాంట్‌లను మూసివేయనున్నారు. అటువంటి పరిస్థితిలో యమునా నది నుండి ఢిల్లీకి నీటిని సరఫరా చేయనున్నారు. అయితే యమునా నీటిలో అమ్మోనియా స్థాయి ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ నీటిని  పరిశుభ్రపరిచేందుకు ఇబ్బందులు ఎదురువుతుంటాయి. ఫలితంగా ఢిల్లీకి నీటి సరఫరా తగ్గిపోయింది. ఇదే ఢిల్లీలో నీటి ఎద్దడికి కారణంగా నిలుస్తోంది. అయితే అవసరమైన ప్రాంతాలకు ట్యాంకార్ల ద్వారా ‍ప్రభుత్వం నీటిని సరఫరా చేస్తుంటుంది.

ఇది కూడా చదవండి: మహారాష్ట్ర ఎన్నికలు: కాంగ్రెస్‌ అభ్యర్థుల నాలుగో జాబితా విడుదల

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)