Breaking News

ఢిల్లీ టీటీడీ దేవాలయంలో మే 3నుంచి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

Published on Fri, 04/28/2023 - 14:37

న్యూఢిల్లీ: ఢిల్లీ టీటీడీ దేవాలయంలో  శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 3 నుంచి 13 వరకు నిర్వహిస్తున్నట్లు నార్త్ ఇండియా టీటీడీ టెంపుల్స్ ఛైర్‌పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు.  11 రోజులపాటు  బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. మే 3న అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. మే 8న  కల్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

'ఢిల్లీ టీటీడీ టెంపుల్ లో త్వరలోనే యాగశాల, పోటు ప్రారంభోత్సవం ఉంటుంది. జూన్ 3 నుంచి 8 మధ్య జమ్ములో టీటీడీ దేవాలయం ప్రారంభోత్సవం. జమ్ములో జూన్ 3న కుంభాభిషేకం, 8 న విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఉంటుంది. టీటీడీ దేవాలయ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని  ఆహ్వానిస్తున్నాం.'  అని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు.

► మే 3 బుధవారం సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య అంకురార్పణ 

► మే 4 ఉదయం 8:30 నుంచి 9.30 మధ్య ధ్వజారోహణ ; సాయంత్రం 7:30 నుంచి 9:30 మధ్య వృషభ లగ్నం పెద్ద శేష వాహనం

► మే 5 ఉదయం 8 నుంచి 9 మధ్య చిన్న శేష వాహనం ; సాయంత్రం ఏడున్నర నుంచి 8:30 మధ్య హంస వాహనం

► మే 6 శనివారం ఉదయం 8 నుంచి 9 మధ్య సింహ వాహనం ; సాయంత్రం ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర మధ్య ముత్యాల పందిరి వాహనం 

► మే 7 ఆదివారం ఉదయం 8 నుంచి 9 మధ్యలో కల్పవృక్ష వాహనం ; సాయంత్రం 7.30 నుంచి 8:30 మధ్య సర్వభూపాల వాహనం 

► మే 8 సోమవారం ఉదయం 8 నుంచి 9 మధ్య మోహిని అవతారం;  సాయంత్రం 5 నుంచి 9 మధ్య కల్యాణోత్సవం , రాత్రి 8 నుంచి 9:30 మధ్య గరుడ వాహనం 

► మే 9 ఉదయం 8 నుంచి 9 మధ్య హనుమంత వాహనం ; సాయంత్రం 7 నుంచి 8:30 మధ్య గజవాహనం 

► మే 10 ఉదయం 8 నుంచి 9 మధ్య సూర్యప్రభ వాహనం ; సాయంత్రం 7.30 నుంచి 8.30 మధ్య చంద్రప్రభ వాహనం 

► మే 11 ఉదయం 7:55 నుంచి 9.30 మధ్య రథోత్సవ మిధున లగ్నం ; సాయంత్రం 7.30 నుంచి 8:30 మధ్య అశ్వ వాహనం 

► మే 12 ఉదయం 11:50 నిమిషాలకు చక్రస్నానం కన్యా లగ్నం ; సాయంత్రం 7 నుంచి 8 గంటల మధ్య ధ్వజారోహణం

► మే 13 శనివారం  సాయంత్రం 6 నుంచి 8 మధ్య అకంకార స్నపనం పుష్య యాగం

చదవండి: టీటీడీ ఆస్పత్రుల్లో ప్రపంచస్థాయి వైద్య ప్రమాణాలు 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)