Breaking News

ప్రేమతో మొదలై.. ఉగ్రవాదంలో తేలింది..!

Published on Sun, 11/30/2025 - 07:59

న్యూఢిల్లీ: డాక్టర్ షాహీన్ సయీద్.. ఢిల్లీ పేలుడు కేసులో నిందితురాలు.. ఉగ్రవాదులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈమె తన జీవితంలో ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నారు. ప్రేమ విఫలమయ్యింది. పెళ్లి పెటాకులయ్యింది. ప్రజల మధ్య మంచి వైద్యురాలిగా పేరు తెచ్చుకున్నా, ఆమె సేవలు ఉగ్రవాదులకు అందుతున్నాయని తేలడంతో ఆమెను ఎరిగినవారంతా కంగుతిన్నారు.

లక్నోకు చెందిన డాక్టర్ షాహీన్ సయీద్ (46) తన కెరీర్‌లో ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ, వ్యక్తిగత జీవితంలో ఆనందం కరువైంది. ఎంబీబీఎస్‌ పూర్తి చేసి, ఫార్మకాలజీలో నైపుణ్యం సాధించిన సయీద్​ 2003లో కంటి వైద్యుడు డాక్టర్ జాఫర్ హయత్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. వృత్తిపరమైన ఒత్తిళ్లు, విదేశాల్లో మెరుగైన జీవితం కోసం ఆమె పట్టుబట్టడం తదితర కారణాలతో 2012 చివర్లో ఆ దంపతులు పదేళ్ల వైవాహిక బంధానికి తెరపడింది. విడాకులతో కుంగిపోయిన సయీద్​ అనంతరం ఘజియాబాద్‌కు చెందిన వస్త్ర వ్యాపారిని రెండోసారి వివాహం చేసుకున్నారు. అయితే ఆ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు.

సయీద్ జీవితంలోకి కశ్మీరీ వైద్యుడు, ఆమె జూనియర్ డాక్టర్ ముజమ్మిల్ షకీల్ ప్రవేశించడంతో ఆమె కథ మరో మలుపు తిరిగింది. హర్యానాలోని అల్‌ఫలా విశ్వవిద్యాలయంలో ఇద్దరూ కలిసి పనిచేయడం, రోజువారీ మీటుంగులతో వారి మధ్య ప్రేమ చిగురించింది. 2023 సెప్టెంబర్‌లో వీరిద్దరూ మసీదులో సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. అయితే ఈ కొత్త బంధం.. సయీద్‌కు ఇంతకు ముందు ఎప్పుడూ లేని ప్రపంచానికి పరిచయం చేసింది. ముజమ్మిల్‌తో కలిసి జీవితం సాగుతున్న తరుణంలో ఆమె మతపరమైన కార్యకలాపాలు, విద్యార్థి సమావేశాలలో విరివిగా పాల్గొనడం ప్రారంభించారు. ఈ సమయంలోనే జైష్ ఎ మొహమ్మద్ (జేఈఎం) మహిళా విభాగమైన జమాత్ ఉల్ మోమినాత్ సభ్యులు ఆమెను సంప్రదించారు.

డాక్టర్ షాహీన్ సయీద్ మేధస్సు, సామాజిక గుర్తింపును వాడుకొని ఆ ఉగ్రవాద సంస్థలు ఆమెకు తీవ్రవాద భావజాలంలో శిక్షణ ఇచ్చాయి. దీంతో ఆమె వైద్యురాలిగా తనకున్న గుర్తింపును ఒక కవచంగా ఉపయోగించుకున్నారు. జమ్ముకశ్మీర్, ఢిల్లీ-ఎన్‌సీఆర్, హర్యానా మధ్య ప్రయాణాలు సాగిస్తూ ‘సందేశాలు’ అందించడం, ఉగ్ర కార్యకలాపాలకు నిధులు బదిలీ చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. పాకిస్తాన్‌లోని జేఈఎం వ్యవస్థాపకుడు మసూద్ అజార్ సోదరి నేతృత్వంలోని జమాత్ ఉల్ మోమినాత్ భారత శాఖకు డాక్టర్ షాహీన్ బాధ్యతలు చేపట్టినట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఇదేవిధంగా ఐదుగురు ఉగ్రవాద వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేసే బాధ్యతను కూడా ఆమెకు అప్పగించినట్లు సమాచారం.

డాక్టర్ షాహీన్ సాగించిన ఈ ఉగ్రవాద ప్రయాణం ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన 10/11 పేలుడు ఘటనతో వెలుగులోకి వచ్చింది. ఈ కేసు దర్యాప్తులో డాక్టర్ సయీద్, ఆమె భర్త ముజమ్మిల్ షకీల్, మరో సహచరుడు అదీల్ అహ్మద్ రాథర్ అరెస్టయ్యారు. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న ఆత్మాహుతి బాంబర్ ఉమర్ మొహమ్మద్ కూడా అల్‌ఫలా విశ్వవిద్యాలయంతో అనుబంధం  కలిగిన కశ్మీరీ వైద్యుడే. కాగా డాక్టర్ షాహీన్ సయీద్ కుటుంబ సభ్యులు (తండ్రి, సోదరుడు) ఆమెపై వచ్చిన ఆరోపణలను నమ్మలేకున్నామని అంటున్నారు.

ఇది కూడా చదవండి: ఢిల్లీ పేలుడు కేసు: విదేశీ డిగ్రీ వైద్యులపై నిఘా!

Videos

ఇది పద్దతి కాదు.. పోలీసులకుపుష్పశ్రీవాణి వార్నింగ్

నేపాల్ లో అదృశ్యమైన హైదరాబాద్ వాసి..

పాపం ఆ లీడర్ పరిస్థితి సైలెంట్ గా సైడ్ కు నెట్టేసిన చంద్రబాబు

AP: నాగమల్లేశ్వరి అరెస్ట్

విశాఖలో పుష్ప శ్రీ వాణి అరెస్ట్

పోలీసులు ఆపుదాం అని చూసారు ఇచ్చిపడేసిన పుష్ప శ్రీ వాణి

వాళ్లకు నీళ్లు.. మాకు కన్నీళ్లా..? బాబుకు శిల్ప చక్రపాణి వార్నింగ్

బాబు సభ కోసం బెదిరింపులు.. బయటపడ్డ ఆడియో లీక్

'రోడ్డు బాగు చేసే వరకు లేవను'.. నడిరోడ్డుపై భీష్మ ప్రతిజ్ఞ!

అమెరికా హెచ్-1బీ వీసా వ్యవస్థలో, భారత్ కేంద్రంగా బయటపడ్డ మహా కుంభకోణం

Photos

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)

+5

కొత్త సినిమా ‘వేట’ ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

‘కూర్మావతార్‌’ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)