Breaking News

‘నన్ను క్షమించండి’.. జేఈఈ పరీక్ష ఫెయిల్‌ అవ్వడంతో..!

Published on Sat, 10/26/2024 - 15:22

న్యూఢిల్లీ: చిన్న చిన్న కారణాలతోనే విలువైన ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. అమ్మానాన్న తిట్టారని, మొబైల్‌ కొనివ్వలేదని, పరీక్షలో ఫెయిల్‌ అయ్యామని, ప్రేమ విఫలమైందని, డిప్రెషన్‌ వంటి కారణాలతో తనువు చాలిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా యువత నుంచి పెద్దవాళ్ల వరకు క్షణికావేశంలో తమను తామే చంపేసుకుంటున్నారు. తాజాగా ఓ యువతి కూడా ఇలాంటి తప్పుడు నిర్ణయమే తీసుకుంది.

జేఈఈ మెయిన్స్‌ పరీక్షలో పాస్‌ కాలేదని మనస్తాపం చెందిన 17 ఏళ్ల యువతి బలవన్మరణానికి పాల్పడింది. బిల్డింగ్‌పై నుంచి దూకి ప్రాణాలు విడిచింది. దేశ రాజధాని ఢిల్లీలోని జామియా నగర్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. యువతి తన ఇంటర్‌ పూర్తికాగానే ఇంజనీరింగ్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ జేఈఈ మెయిన్స్‌కు ప్రిపేర్‌ అవుతోంది. అయితే చదువులో ఒత్తిడి కారణంగా పరీక్ష పాస్‌ కాలేదు. ఆమె అనుకున్న అంచనాలను చేరుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపంతో శుక్రవారం రాత్రి షాహిన్‌ భాగ్‌లోని బిల్డింగ్‌లోని ఏడో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలి వద్ద సూసైడ్‌ లేఖను స్వాధీనం చేసుకున్నారు. అందులో‘ నన్ను క్షమించండి.. నేను సాధించలేకపోయాను. జేఈఈ పరీక్షను క్లియర్‌ చేయలేకపోయాను’ అని రాసి ఉంది. అయితే పరీక్షలో ఫెయిల్ అయితే ప్రాణాలు తీసుకుంటానని బాలిక గతంలో తన తల్లికి తెలియజేసిందని పోలీసులు తెలిపారు. ఆమె తండ్రి ప్రైవేట్ ఉగ్యోగి కాగా, ఆమె తల్లి గృహిణి.

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)