Breaking News

దంచికొట్టిన వానలు.. ఢిల్లీ మెరుగుపడిన గాలి నాణ్యత

Published on Sat, 09/14/2024 - 16:06

న్యూఢిల్లీ: ఢిల్లీని శుక్రవారం భారీ వర్షాలు ముంచెత్తిన విషయం తెలిసిందే. దేశ రాజధానితోపాటు పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. అయితే రికార్డు స్థాయిలో నమోదైన వర్షపాతం కారణంగా దేశ రాజధాని, పరిసరి ప్రాంతాల్లో గాలి నాణ్యత మెరుగుపడింది.

ఇప్పుడిప్పుడే ఢిల్లీలోవాతావరణ పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. పొల్యూషన్‌తో గత కొన్నేళ్లుగా హడలెత్తిపోతున్న ఢిల్లీ వాసులు.. ప్రస్తుతం మంచి గాలిని పీల్చుకుంటున్నారు. తాజాగా ఢిల్లీ నగరం గాలి నాణ్యత సూచికలో 52గా నమోదైంది.  ఫరీదాబాద్‌లో ఏక్యూఐ 24, ఘజియాబాద్‌లో 34, నోయిడాలో46గా నమోదైంది.  గురుగ్రామ్ 69, బులంద్‌షహర్ 21, మీరట్ 28, ముజఫర్‌నగర్ 29గా ఉంది.

అయితే ఢిల్లీలో గాలి నాణ్యత మెరుగవ్వడం వెనక చురుకుగా కదులుతున్న రుతుపవనాల ద్రోణి కారణమని అధికారాన్ని భావిస్తున్నారు. ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ ప్రాంతాల్లో కుండపోత వర్షం పడిన సంగతి తెలిసిందే. దీంతో గాలిలోని కాలుష్యం వర్షానికి కొట్టుకుపోయినట్లు, అదే విధంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలి కూడా సహయపడినట్లు పేర్కొన్నారు.

కాగా  ఈనెలలో ఇప్పటి వరకు కురిసిన వర్షం వార్షిక, నెలసరి సగటు వర్షపాతం కంటే ఎక్కువ నమోదైంది. ఇది 1000 మి. మీ మార్కును దాటింది. సెప్టెంబర్‌లో సాధారణం కంటే 55% ఎక్కువ వర్షపాతం నమోదైంది. శుక్రవారం మూడు గంటల్లో మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు 30.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని సఫ్దర్‌జంగ్‌లోని వాతావరణ కేంద్రం తెలిపింది. 

ఇదిలా ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ దేశ రాజధానిలో  కాలుష్యం తగ్గుముఖం పట్టిందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వెల్లడించింది.  గత 9 సంవత్సరాల్లో లేని గాలి నాణ్యత 2024  ఫిబ్రవరిలో నమోదైంది. గాలి నాణ్యత సూచిక 200 కంటే తక్కువగా నమోదు కాగా.. గతంలో అయితే AQI 400 నమోదు అయింది.

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)