Breaking News

ఏం జరిగిందో అర్థం కాలేదు, కానీ..: ప్రత్యక్ష సాక్షులు

Published on Mon, 11/10/2025 - 20:03

సాక్షి, న్యూఢిల్లీ: భారీ పేలుడుతో ఎర్రకోట వద్ద భయానక వాతావరణం నెలకొంది. సోమవారం సాయంత్రం సంభవించిన పేలుడు ధాటికి 9 మంది మృతి చెందగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంతో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌.. దేశవ్యాప్తంగా హైఅలర్ట్‌ ప్రకటించారు.  

పేలుడు శబ్దం ఎంత బిగ్గరగా ఉందంటే సమీపంలోని దుకాణాల కిటికీలు, తలుపులు, కిటికీలు పగిలిపోయాయి. పలు దుకాణాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. పేలుడు ధాటికి మృతదేహాలు తునాతునకలు కావడం పేలుడు తీవ్రతకు అద్దం పడుతోంది. గాయపడిన వాళ్లకు ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

పార్కింగ్‌ చేసిన కారులో భారీ పేలుడు సంభవించిందని.. ఆ తీవ్రతకు చుట్టుపక్కల వాహనాలు ధ్వంసం అయ్యాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ‘‘ఏం జరిగిందో అర్థం కాలేదు. గాయపడ్డ వాళ్లను వంద అడుగుల దూరం లాక్కొచ్చాం’’ అని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెబుతున్నారు.

‘‘నా జీవితంలో ఇంత పెద్ద శబ్దం నేను ఎప్పుడూ వినలేదు. పేలుడు ధాటికి నేను మూడుసార్లు కింద పడ్డాను. మేమంతా చనిపోబోతున్నట్లు అనిపించింది’’ అని ఓ దుకాణదారుడు చెప్పారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)