Breaking News

Delhi Rains: నీట మునిగిన ఢిల్లీ

Published on Sat, 06/29/2024 - 05:14

న్యూఢిల్లీ: దేశ రాజధాని నీట మునిగింది. రికార్డు స్థాయి భారీ వర్షాలకు అతలాకుతలమైంది. ఢిల్లీతో పాటు జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్‌)లో వరుసగా శుక్రవారం రెండో రోజూ భారీ వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపులతో ఎడతెగని వర్షం పడింది. దాంతో భరించలేని ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఢిల్లీ వాసులకు ఉపశమనం కలిగినా నగరంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. 

ఢిల్లీలోని పలు ప్రాంతాలతో పాటు ఎన్సీఆర్‌ రోడ్లను వరదలు ముంచెత్తాయి. వరద నీటి ధాటికి చాలాచోట్ల డ్రైనేజీ వ్యవస్థ స్తంభించిపోవడంతో సమస్య మరింత విషమించింది. సమీప ప్రాంతాలన్నింటినీ వరద ముంచెత్తింది. ఢిల్లీ జల మంత్రి ఆతిశితో పాటు శశి థరూర్‌ తదితర ఎంపీల నివాసాలు కూడా నీట మునిగాయి. వారి ఇళ్లలోని ఫరి్నచర్‌ తదితరాలు వరద నీటిలో తేలియాడుతూ కని్పంచాయి. వర్షాలు, సంబంధిత ఉదంతాల్లో ఐదుగురు మరణించారు. 

నీటితో నిండిపోయిన అండర్‌పాస్‌ల్లో వాహనాలు తేలియాడాయి. పలుచోట్ల వాటిలో ప్రయాణికులు గంటలపాటు చిక్కుకున్నారు. గుర్గావ్‌లోని పలు నివాస ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ట్రాఫిక్‌ గందరగోళం ఏర్పడింది. తూర్పు ఢిల్లీలోని అక్షరధామ్‌ నుంచి గాజీపూర్‌ దాకా, అక్షరధామ్‌–సరాయ్‌ కాలే ఖాన్‌ రహదారిపైనా... ఇలా ఎక్కడ చూసినా ట్రాఫిక్‌ గంటల తరబడి నిలిచిపోయి జనాలకు చుక్కలు చూపింది. ఎక్కడ చూసినా మోకాలి లోతు, అంతకు మించి వరద కని్పంచింది. పలు చోట్ల మెట్రో స్టేషన్లు కూడా నీట మునిగాయి. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ వాతావరణ కేంద్రంలో ఏకంగా 153.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈదురు గాలుల ధాటికి పలుచోట్ల చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. 

జూలై 3 దాకా వానలే 
ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో గురువారం నుంచి శుక్రవారం ఉదయం దాకా 24 గంటల్లో 228 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అక్కడ గత 88 ఏళ్లలో అత్యధిక వర్షపాతంగా రికార్డుకెక్కింది. జూన్‌లో ఢిల్లీలో సగటున 80.6 మి.మీ వర్షం కురుస్తుంది. ఢిల్లీలో ఏడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కొనసాగవచ్చని భారత వాతావరణ శాఖ పేర్కొంది. జూలై 3 దాకా ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ‘‘ఈదురుగాలులతో భారీ వర్షాలు పడొచ్చు. జూలై 1, 2 తేదీల్లో ఉరుములతో కూడిన వర్షం 
పడుతుంది’’ అని పేర్కొంది.

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)