Breaking News

కాస్తంత తగ్గిన యమున నీటి మట్టం.. కోలుకుంటున్న ఢిల్లీ

Published on Sun, 07/16/2023 - 05:30

న్యూఢిల్లీ: ఢిల్లీలో కుంభవృష్టి వర్షాలు లేకున్నా ఎగువప్రాంతాల నుంచి యమునా నది మోసుకొచి్చన వరదనీటితో అల్లాడిపోయిన దేశ రాజధాని నెమ్మదిగా తెరిపినపడుతోంది. గురువారం రాత్రి అత్యంత ప్రమాదకరంగా 208.66 మీటర్లుగా ఉన్న నది నీటిమట్టం శనివారం ఉదయం పదిగంటలకు 207.43 మీటర్లకు తగ్గడమే ఇందుకు కారణం. వరదముంపు ప్రాంతాల్లో పరిస్థితులు నెమ్మదిగా కుదుటపడుతున్నాయని డివిజనల్‌ కమిషనర్‌ అశ్వనీ కుమార్‌ చెప్పారు. ‘అవిశ్రాంతంగా శ్రమిస్తున్న అధికారులపై ఎన్నికైన ‘ప్రభుత్వం’ విమర్శలు చేయడం తగదు.

ఇది అధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది’ అని ఆప్‌ సర్కార్‌నుద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. హరియాణాలోని హాతీ్నకుండ్‌ బ్యారేజీ నుంచి వరదనీటి ఔట్‌ఫ్లో తగ్గడంతో ఢిల్లీ పరిసరప్రాంతాల్లో వరదప్రభావం గంట గంటకు తగ్గుతోంది. అయితే భారతవాతావరణ శాఖ మాత్రం ఢిల్లీలో వచ్చే రెండ్రోజులు వర్షాలు పడతాయని సూచించింది. భీకరవర్షాల బారిన పడిన ఉత్తరాఖండ్, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో మరో ఐదు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలుపడే అవకాశం ఉందని అంచనావేసింది. దీంతో యమునా నీటిమట్టం మళ్లీ పెరుగుతుందనే భయాలు ఢిల్లీవాసుల్లో వ్యక్తమయ్యాయి.   

ఆక్రమణలే ముంచాయి
ఢిల్లీలో వరదకు కారణం నదీ పరివాహక ప్రాంతాల ఆక్రమణ అని కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) సీనియర్‌ అధికారి ఒకరు విశ్లేíÙంచారు. ‘గతంలో  వరదనీరు విస్తారమైన ప్రాంతం గుండా ప్రవహించేది. ఇప్పుడు ఆ ప్రాంతమంతా ఆక్రమణలతో ఇరుకైపోయింది. దీంతో ఇరుకుదారుల్లో ఎత్తుగా ప్రవహించి సుదూర ప్రాంతాలను వరదముంచెత్తింది. గతంతో పోలిస్తే ఈఏడాది హత్నీకుండ్‌ బ్యారేజీ నుంచి నీరు ఢిల్లీకి చాలా తక్కువ సమయంలో, ఎక్కువ పరిమాణంలో చేరుకుంది’ అని అధికారి విశ్లేíÙంచారు. ‘ యమున ఎగువ ప్రాంతం మొత్తంలో ఒకేసారి భారీవర్షాలు పడటం ఈసారి పెద్ద వరదకు మరో కారణం’ అని ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌(ఐయూసీఎన్‌) భారత ప్రతినిధి యశ్‌వీర్‌ భట్నాగర్‌ చెప్పారు.

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)