Breaking News

నెల క్రితమే నిశ్చితార్థం.. జీవితాన్ని మలుపు తిప్పిన విహారం

Published on Sun, 04/06/2025 - 09:27

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మరికొన్ని నెలల్లో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలనుకున్న జంటకు ఊహించని అనుభవం ఎదురైంది. ఏదో సరదాగా అమ్యూజ్‌మెంట్ పార్క్‌కు వెళ్లడమే వారి జీవితాన్ని మలుపు తిప్పింది. పార్క్‌లో జరిగిన ప్రమాదంలో తనకు కాబోయే భార్య చనిపోయింది.

వివరాల ప్రకారం.. నిఖిల్ అనే వ్యక్తికి ప్రియాంక(24)తో కుటుంబ సభ్యులు పెళ్లి నిశ్చయించారు. ఈ క్రమంలో వారిద్దరికీ ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. మరికొన్ని నెలల్లో వారికి పెళ్లి జరిగాల్సి ఉంది. అయితే, ఇద్దరూ సరదాగా తిరుగొద్దామని నైరుతి ఢిల్లీలోని కపషెరా ప్రాంతంలో ఉన్న ఫన్ అండ్ ఫుడ్ విలేజ్‌కు వెళ్లారు. కాసేపు అక్కడ తిరిగిన తర్వాత అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో రోలర్ కోస్టర్ రైడ్ ఎక్కారు. హ్యాపీ మూమెంట్స్‌ ఎంజాయ్‌ చేస్తున్న సమయంలో రోలర్ కోస్టర్ స్టాండు విరిగిపోయింది. దీంతో, ప్రియాంక ఎత్తులో నుంచి కింద పడిపోయింది.

దీంతో వెంటనే కాబోయే భర్త నిఖిల్ ఆమెను సమీప హాస్పిటల్‌కు తరలించాడు. కానీ ఎలాంటి ఫలితం లేకపోయింది. అప్పటికే ఆ యువతి మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. దీంతో, ఒక్కసారిగా నిఖిల్‌ కుప్పకూలిపోయి కన్నీటిపర్యంతమయ్యాడు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. మృతిచెందిన ప్రియాంక శరీరంపై తీవ్ర గాయాలు బట్టి.. ఈఎన్‌టీ రక్తస్రావం, కుడి కాలు చీలడం, ఎడమ కాలు మీద గాయం, కుడి ముంజేయి, ఎడమ మోకాలికి తీవ్ర గాయాలు అయినట్టు వైద్యులు వెల్లడించారు.

ఇదిలా ఉండగా.. చాణక్యపురికి చెందిన ప్రియాంక.. నోయిడాలోని సెక్టార్ 3లోని ఒక టెలికాం కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు తల్లిదండ్రులతో పాటు ఒక సోదరుడు, ఒక సోదరి ఉన్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)