Breaking News

Delhi Pollution: ఢిల్లీలో వరస్ట్‌ మార్నింగ్‌

Published on Mon, 11/18/2024 - 07:21

దేశ రాజధానిలో కాలుష్యం అంతకంతకూ పెరిగిపోతూ.. డేంజర్‌ లెవల్‌ను దాటిపోయింది. ఈ ఉదయం నగరంలో వాయునాణ్యత సూచీ (ఏక్యూఐ) 450 severe-plus  దాటింది. దీంతో ఈ సీజన్‌కే వరెస్ట్‌ పరిస్థితి నెలకొంది. మరోవైపు పొగమంచు కమ్మేయడం అన్నీ రవాణా వ్యవస్థలకు ఆటంకం కలుగుతోంది.  ఇప్పటికే పలు ఆంక్షలు విధించగా.. ఈ ఉదయం నుంచి మరిన్ని కఠిన ఆంక్షలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ పరిధిలో  ఈ ఉదయం నుంచి ‘గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌ (జీఆర్‌ఏపీ)- 4’ కింద మరిన్ని నిబంధనలను అమల్లోకిచ్చాయి. ఢిల్లీలో ట్రక్కుల ప్రవేశంపై నిషేధం విధించారు. నిత్యావసరాలు అందించే ట్రక్కులకు మాత్రమే అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.  అలాగే.. ఎల్‌ఎన్‌జీ, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్, బీఎస్‌-4 డీజిల్‌ ట్రక్కులనే తిరగనిస్తారు.

మరోవైపు కాలుష్యానికి దట్టమైన పొగమంచు తోడైంది. విమాన ప్రయాణాలపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఉదయం ఐదు గంటలకు విజిబిలిటీ 150 మీటర్ల దూరానికి పడిపోయింది. ఈ ఉదయం ఏడుగంటలకు.. ఏక్యూఐ 481గా నమోదైంది. 



👉ఏక్యూఐ 0-50 మద్య ఉంటే గుడ్‌, 
👉51-100 ఉంటే సంతృప్తికరం, 
👉101-200 మధ్య ఉంటే ఓ మోస్తరు కాలుష్యం, 
👉201-300 నుంచి పూర్‌, 
👉301 నుంచి 400 మధ్య ఉంటే వెరీ పూర్‌, 
👉401 నుంచి 450 ఉంటే సివియర్‌, 
👉450 పైనే ఉంటే వెరీ సివియర్‌ 

ఈ స్థాయిలో ఢిల్లీ కాలుష్యం పెరగడంపై ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ కమిషన్‌ (సీఏక్యూఎం) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అన్నిరకాల నిర్మాణాలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. హైవేలు, రోడ్లు, ఫ్లైఓవర్‌ వంతెనలు, పవర్‌ లైన్‌లు, పైపులైన్‌లు.. ఇలా ఎలాంటి నిర్మాణ సంబంధిత ప్రాజెక్టులైనా సరే ఆపేయాలని స్పష్టం చేసింది. అలాగే.. సరి-బేసి వాహన నిబంధనలు అమలు చేయడంపై నిర్ణయం తీసుకోవాలని ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ కమిషన్‌ సూచించింది.

కాలుష్యానికి తోడు దట్టమైన పొగమంచు పేరుకుపోయి కనీసం వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది.  ఆదివారం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మూడు విమానాలను రద్దు చేయగా.. మరో 107 విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి.

సీఏక్యూఎం సూచన మేరకు.. ఇప్పటికే 1 నుంచి ఐదో తరగతి వరకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నారు. తాజాగా 6 నుంచి 9, 11 తరగతుల విద్యార్థులకు వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో తదుపరి ఆదేశాలు వచ్చేవరకు అన్ని పాఠశాలలకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని విద్యాశాఖను ఢిల్లీ సీఎం ఆతిశీ ఆదేశించారు.

ప్రైవేట్‌ ఆఫీసులతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు కూడా 50 శాతం సామర్థ్యంతో పని చేసేలా చర్యలు చేపట్టాలని, మిగతావాళ్లను వర్క్‌ఫ్రమ్‌ హోం ద్వారా పని చేయించుకోవాలని  అధికార యంత్రాగానికి సీఏక్యూఎం సిఫారసు చేసింది.

ఇదీ చదవండి: మందు పార్టీ లేదా సీఎం సాబ్‌?

Videos

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)