అన్ని సంస్థల్లో 50 శాతం వర్క్‌ ఫ్రం హోం : ధిక్కరిస్తే చర్యలు

Published on Wed, 12/17/2025 - 11:39

న్యూఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్య సంక్షోభం నగర వాసులు అతలాకుతలం చేస్తోంది. ఎటు చూసినా కాలుష్య మేఘాలు దట్టంగా కమ్మేశాయి.  రోజు రోజుకీ అత్యంత దారుణంగా పడిపోతున్న వాయు నాణ్యత మధ్య చిన్నా, పెద్దా అంతా పలు రకాల శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు.  ఈనేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం  తీసుకుంది.  నగరంలోని అన్ని సంస్థలకు 50శాతం వర్క్ ఫ్రమ్ హోమ్‌ను తప్పనిసరి చేసింది.

ఢిల్లీ ప్రభుత్వం బుధవారం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది.  అన్ని ప్రభుత్వ , ప్రైవేట్ కంపెనీలు 50 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిలో పనిచేయాలని తెలిపింది.  ఈ ఆదేశాన్ని ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తామని కూడా హెచ్చరించింది.అలాగే  తాజా ప్రకటన ప్రకారం, ప్రస్తుత కాలుష్య నిరోధక ఆంక్షల కింద నిర్మాణ కార్యకలాపాలను నిషేధించిన నేపథ్యంలో ప్రస్తుతం పని చేయలేని రిజిస్టర్డ్ నిర్మాణ కార్మికులకు ఢిల్లీ ప్రభుత్వం రూ. 10,000 పరిహారం అందిస్తుంది.

ఇదీ చదవండి: మెస్సీకి అనంత్‌ అంబానీ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌, ఖరీదెంతో తెలుసా?

కాగా గత కొన్నేళ్లుగా కాలుష్య కాసారంగా మారిపోయిన దేశ రాజధాని నగరంలోడిసెంబర్ 15న  సీజన్‌లో అత్యంత దారుణమైన వాయు నాణ్యత నమోదైంది. వాయు నాణ్యత AQI 'తీవ్రమైన ప్లస్' కేటగిరీలో 498గా నమోదైంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) డేటా ప్రకారం, అంతకు ముందు రోజు నుంచే AQI క్షీణించడం కొనసాగింది. వాయు నాణ్యత ఇంత దిగజారి పోవడం ఇదే తొలిసారి.  శనివారం నుండి సోమవారం వరకు రాజధానిలో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో, పలు రోడ్డు ప్రమాదాలు, వాహనాల గుద్దు కోవడాలు, విమానాల రద్దు, లేదా ఆలస్యాలు జరిగాయి. దీన్ని ఎదుర్కొనే చర్యల్లో భాగంగాఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (CAQM) త్వరగా రాజధాని అంతటా అత్యంత కఠినమైనకాలుష్య నిరోధక ఆంక్షలను అమలు చేస్తోంది.
 

 

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)