Breaking News

బాణసంచా కాల్చేవారిపై పోలీసుల దృష్టి

Published on Thu, 10/31/2024 - 12:31

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో బాణసంచా కాల్చేవారిపై పోలీసులు నిఘా సారించారు. గల్లీగల్లీని నిశింతగా పరిశీలిస్తున్నారు. ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌లను స్వీకరిస్తూ అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

దీపావళి వేళ నగరంలో బాణసంచా అమ్మకాలు, కొనుగోళ్లపై ప్రభుత్వం పూర్తిగా నిషేధం విధించింది. ఇది అమలయ్యేలా చూసేందుకు ప్రభుత్వం  377 పోలీసు బృందాలను ఏర్పాటు చేసింది. పండుగ సందర్భంగా బాణసంచా కాల్చే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. బాణాసంచా నిషేధం అమలయ్యేలా చూసేందుకు సాధారణ దుస్తుల్లో పోలీసులు నిరంతరం నిఘా సారిస్తున్నారు.

ఢిల్లీ ప్రభుత్వం అక్టోబర్ 14న నగరంలో బాణాసంచా తయారీ, నిల్వ, అమ్మకం, కొనుగోళ్లను నిషేధించింది. ఇది వచ్చే ఏడాది జనవరి ఒకటి వరకు అమలులో ఉంటుంది. దీపావళి రోజున చాందినీ చౌక్, సరోజినీ నగర్, లజ్‌పత్ నగర్, గ్రేటర్ కైలాష్, ఆజాద్‌పూర్, ఘాజీపూర్ వంటి మార్కెట్‌లలో భారీ రద్దీ నెలకొనడంతో ఆయా ప్రాంతాల్లో పోలీసులను మోహరించారు.  

ఈ సందర్భంగా డీసీపీ అపూర్వ గుప్తా మాట్లాడుతూ దీపావళి వేళ మార్కెట్లు, మాల్స్, వివిధ సంస్థలు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ఇంటెన్సివ్ పెట్రోలింగ్, అదనపు చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న కార్యకలాపాలపై కూడా పోలీసులు నిఘా సారించారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్‌), గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్‌పీ) పెట్రోలింగ్ బృందాలు ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తిస్తే వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 

ఇది కూడా చదవండి: కాలుష్యంలేని, నిశ్శబ్ద దీపావళి సాధ్యమేనా? ఈ టిప్స్‌ పాటిద్దాం!
 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)