Breaking News

ఇండియా కూటమికి ఢిల్లీ పోలీసుల షాక్!

Published on Sat, 10/31/2026 - 12:17

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడి అంతకంతకూ పెరుగుతోంది. నవంబర్ 1న రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న ఇండియా కూటమి భారీ బహిరంగ సభకు ఢిల్లీ పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే కనాట్ ప్లేస్‌–మింటో రోడ్ జంక్షన్ నుంచి రామ్‌లీలా మైదానం వరకు నిర్వహించాలనుకున్న పాదయాత్రకు మాత్రం అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. దీంతో సభకు అనుమతి లభించినప్పటికీ, పాదయాత్ర విషయంలో ఉత్కంఠ నెలకొంది.

పాదయాత్రపై పోలీసుల అభ్యంతరం 
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ కార్యక్రమంలో పాదయాత్ర వివరాలను వెల్లడించారు. మధ్యాహ్నం 12 గంటలకు మింటో రోడ్‌–కనాట్ ప్లేస్ నుంచి యాత్ర ప్రారంభమై రామ్‌లీలా మైదానానికి చేరుకుంటుందని ప్రకటించారు. అయితే ఈ యాత్రకు సంబంధించి తమకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. న్యూఢిల్లీ, సెంట్రల్ జిల్లా పోలీసులు కూడా అనుమతి కోరుతూ ఎలాంటి దరఖాస్తు అందుకోలేదని పేర్కొన్నాయి.

ఎస్ఐఆర్‌కు వ్యతిరేకంగా పోరు
నవంబర్ 1న నిర్వహించే భారీ సభలో వివాదాస్పద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను వెనక్కి తీసుకోవాలని ఇండియా కూటమి డిమాండ్ చేయనుంది. అలాగే కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కోరనుంది. ఈ కార్యక్రమానికి రాజకీయ పార్టీలతో పాటు సామాజిక సంస్థలు, పౌర సమాజ ప్రతినిధులు, జర్నలిస్టులు, ఇతర వర్గాల ప్రజలు హాజరుకావాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.

కేంద్రంపై రాహుల్ విమర్శలు 
దేశ రాజధానికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే పార్టీ కార్యకర్తలు, సామాన్య ప్రజలను అడ్డుకునేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రయత్నిస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, తెలంగాణ, పంజాబ్ తదితర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి రావాలనుకునే వారిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. నరేంద్ర మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల సంఘంలోని వారి బృందం ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నారని ఆయన ఆరోపించారు.

ర్యాలీ వాయిదా వేయాలంటున్న వ్యాపారులు 
మరోవైపు నవంబర్ 1న నిర్వహించనున్న సభను వాయిదా వేయాలని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) ఇండియా కూటమి నేతలకు లేఖ రాసింది. దీపావళి, ధన్‌తేరస్ పండుగల నేపథ్యంలో వ్యాపారాలు సాగాల్సిన సమయంలో భారీ ర్యాలీ నిర్వహిస్తే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. అఖిలేశ్ యాదవ్, మమతా బెనర్జీ, తేజస్వి యాదవ్, ఉద్ధవ్ ఠాక్రే తదితర నేతలకు ఈ విజ్ఞప్తి చేసింది.

నవంబర్ 10 తర్వాత నిర్వహించాలని సూచన 
దీపావళి పండుగ ముగిసిన తర్వాత, ముఖ్యంగా నవంబర్ 10 లేదా 11 తర్వాత ర్యాలీ నిర్వహించేలా చూడాలని సీటీఐ కోరింది. అయితే రాహుల్ గాంధీ మాత్రం ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే సభ జరుగుతుందని స్పష్టం చేశారు. ఒకవైపు పోలీసుల అనుమతులపై స్పష్టత, మరోవైపు వ్యాపార సంఘాల అభ్యంతరాల మధ్య నవంబర్ 1న జరగనున్న ఇండియా కూటమి సభపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)