Breaking News

కాస్త ఎండ.. అంతలోనే విపరీతమైన చలి!

Published on Mon, 01/08/2024 - 07:29

దేశ రాజధాని ఢిల్లీతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో చలి తీవ్రత పెరగడంతో పాటు విపరీతంగా పొగమంచు కమ్ముకుంటోంది. అయితే చాలా రోజుల తర్వాత ఆదివారం కాస్త ఎండ కనిపించింది. అయితే సాయంత్రానికల్లా మళ్లీ చలి వివరీతంగా పెరిగింది. 

పొగమంచు కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏ‍ర్పడింది. ఢిల్లీకి వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్‌తో సహా 22 రైళ్లు ఆరు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. చలి కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీలో ఉదయం పూట ఈ వారం పొడవునా తేలికపాటి పొగమంచు కమ్ముకునే అవకాశం ఉంది. జనవరి 9న తేలికపాటి వర్షం లేదా చినుకులు పడవచ్చు.

ఢిల్లీలో శీతాకాల సెలవులను జనవరి 12 వరకు పొడిగించారు. అయితే ఇది ఐదవ తరగతిలోపు విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది. 6 నుంచి 12 వ తరగతి విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తారు.  ఉదయం 8 గంటల తరువాతనే వీరికి తరగతులు నిర్వహిస్తారు. 

ఢిల్లీలో ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 18.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది శనివారం కంటే మూడు డిగ్రీలు తక్కువ. కనిష్ట ఉష్ణోగ్రత 8.2 డిగ్రీలుగా నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత తగ్గడం వల్ల వాయు కాలుష్యం తీవ్రమయ్యింది. ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 333గా ఉంది. జమ్మూ డివిజన్‌లో దట్టమైన పొగమంచు కారణంగా చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. 11 విమానాలు ఆలస్యంగా నడిచాయి.

Videos

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)