21ఏళ్లకే బీర్‌ తాగొచ్చు..!

Published on Sat, 09/13/2025 - 06:29

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇకపై 21 సంవత్సరాలున్న యువత బీరు తాగేందుకు అర్హులవుతారు. ఆబ్కారీ చట్టం ప్రకారం ఢిల్లీ మినహా దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 25 ఏళ్లున్న వారికి మాత్రమే బీరు తాగేందుకు అనుమమతి ఉంది. తాజాగా ఈ రూల్‌ను మార్చి కొత్త మద్యం విధానాన్ని తెచ్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 

21 ఏళ్ల వయస్సు వారిని బీరు తాగేందుకు అనుతించడం వల్ల వీరంతా శివారులోని గురుగ్రామ్, నోయిడా, ఘాజియాబాద్‌ వంటి ప్రాంతాలకు వెళ్లి అక్రమంగా మద్యం తాగడాన్ని నిరోధించవచ్చని భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం సంబంధిత వర్గాలు నిపుణులతో చర్చలు జరుపుతోంది. నాలుగైదు నెలల్లో కొత్త మద్యం విధానాన్ని తీసుకువచ్చే అవకాశం ఉంది. 

కొత్త విధానం ఎలా ఉండొచ్చు..? 
ప్రస్తుతం ఉన్న మద్యం విధానం ప్రకారం ప్రభుత్వ ఆదాయం ఏడాదికి రూ.12 వేల కోట్ల నుంచి రూ.13వేల కోట్ల వరకు ఉండాలి. కానీ, రూ.7 వేల కోట్ల నుంచి రూ.8 వేల కోట్లు మాత్రమే వస్తోంది. కొత్త విధానం ద్వారా ఆదాయాన్ని బాగా పెంచుకోవడమే ఢిల్లీ ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ప్రైవేటు మద్యం దుకాణాలను కూడా తెరవాలని యోచిస్తోంది. బ్రాండెడ్‌ మద్యం కొరతను నివారించడంపైనా దృష్టి సారించింది. 

బ్రాండెడ్‌ మద్యం కొరత కారణంగా నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌(ఎన్‌సీఆర్‌)లో జరుగుతున్న రూ.5 వేల కోట్ల నుంచి రూ.7000 కోట్ల లావాదేవీలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది. ఈ ఆదాయం ప్రధానంగా శివారులోని గురుగ్రామ్, నోయిడా, గాజియాబాద్‌ వంటి ప్రాంతాలకు వెళుతోంది. నివాస ప్రాంతాలు మినహా షాపింగ్‌ మాల్స్‌ తదితర వ్యాపార సముదాయాల్లో మద్యం షాపులను తెరవనున్నారు.

 కొత్త మద్యం పాలసీ పూర్తిగా ప్రభుత్వం, లేదా ప్రభుత్వం–ప్రైవేట్, లేదా పూర్తిస్థాయి ప్రైవేట్‌ అనే మూడు మోడళ్లపై చర్చిస్తోంది. గతంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రైవేట్‌ మద్యం దుకాణాలకు అనుమతిచ్చి విమర్శల పాలైంది. ఆ తర్వాత వాటిని మూసివేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త లిక్కర్‌ పాలసీపై పూరి్థస్థాయి చర్చల తర్వాతే ప్రభుత్వం తుది నిర్ణయం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)