Breaking News

Delhi: మళ్లీ బీజేపీదే విజయం.. మిన్నంటుతున్న సంబరాలు

Published on Wed, 12/03/2025 - 11:42

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ తాజాగా జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ)ఉప ఎన్నికల్లోనూ విజయ బావుటా ఎగురవేసింది.  బుధవారం ఎంసీడీ ఫలితాలు వెల్లడికాగా, భారతీయ జనతా పార్టీ 12 వార్డులకు గాను ఏడు స్థానాలను గెలుచుకుని, మెజారిటీని సాధించింది. ద్వారకా బీ, వినోద్ నగర్, అశోక్ విహార్, గ్రేటర్ కైలాష్, డిచాన్ కలాన్, షాలిమార్ బాగ్ బీ, చాందిని చౌక్ తదితర ముఖ్య వార్డులను బీజేపీ కైవసం చేసుకుంది. తద్వారా బీజేపీ తన కోటను నిలబెట్టుకుంది. ఈ ఫలితాలు అధికార బీజేపీకి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌)కి, కాంగ్రెస్‌కు ఒక కీలకమైన పరీక్షగా మారగా, దీనిలో బీజేపీ తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 51 మంది అభ్యర్థులు బరిలోకి దిగగా, వారిలో 26 మంది మహిళలు  ఉన్నారు.

ఎంసీడీ ఉప ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) మూడు వార్డులను గెలుచుకోవడం ద్వారా తన ఉనికిని చాటుకుంది. ఆప్‌ గెలిచిన వార్డులలో నరైనా, ముండ్కా దక్షిణపురి ఉన్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి కొంత ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ 2022 ఎంసీడీఎన్నికలలో గెలిచిన తమ సిట్టింగ్ వార్డులైన సనగం విహార్ ఏ, నరైనాను కోల్పోయింది. ఈ ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ  తన ఖాతాను తెరిచింది. సనగం విహార్ ఏ వార్డును కాంగ్రెస్‌ గెలుచుకుంది. మరో వైపు చాందిని మహల్ వార్డును ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్‌బీ)కి చెందిన మొహమ్మద్ ఇమ్రాన్ గెలుచుకోవడం విశేషం.

ఈ ఉప ఎన్నికలు జరిగిన 12 వార్డులలో గ్రేటర్ కైలాష్, షాలిమార్ బాగ్ బి, అశోక్ విహార్, చాందిని చౌక్, చాందిని మహల్, డిచాన్ కలాన్, నరైనా, సంగం విహార్ ఎ, దక్షిణ్ పురి, ముండ్కా, వినోద్ నగర్,  ద్వారకా బి ఉన్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, కొద్దిసేపటికే ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఉప ఎన్నికల ఫలితాలను 2022 ఎంసీడీ సాధారణ ఎన్నికల ఫలితాలతో పోల్చిచూస్తే.. 2022 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 134 సీట్లతో (42.05% ఓట్లు) మెజారిటీ సాధించగా, భారతీయ జనతా పార్టీ 104 సీట్లతో (39.09% ఓట్లు) బలమైన ప్రతిపక్షంగా నిలిచింది. తాజా ఉప ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సాధించింది. ఆప్‌,  కాంగ్రెస్‌లు కూడా తమ ఉనికిని నిలబెట్టుకున్నాయి.

ఇది కూడా చదవండి: చూపు లేకున్నా.. శరీరం సహకరించకున్నా..

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)