Breaking News

వడదెబ్బ... 108 డిగ్రీల జ్వరం

Published on Fri, 05/31/2024 - 05:36

న్యూఢిల్లీ: ఢిల్లీని చుట్టుముట్టిన వడగాలులు ఒక మధ్యవయస్కుడి ప్రాణం తీశాయి. వడదెబ్బతో ఆస్పత్రిలో చేరిన అతడి శరీర ఉష్ణోగ్రత చూసి వైద్యులు హుతాశులయ్యారు. అతని శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే 10 డిగ్రీలు ఎక్కువ ఉండటం గమనార్హం. సోమవారం రాత్రి జరిగిన ఘటన వివరాలను రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రి డాక్టర్‌ రాజేశ్‌ శుక్లా వెల్లడించారు.

 ‘‘ బిహార్‌లోని దర్భాంగా పట్టణానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తి సోమవారం ఢిల్లీలో వడదెబ్బకు గురయ్యారు. వెంటనే ఆర్‌ఎంఎల్‌ ఆస్పత్రిలో చేరారు. ఆయన శరీర ఉష్ణోగ్రత 108 డిగ్రీ ఫారన్‌హీట్‌కు చేరుకోవడం చూసి ఆందోళనకు గురయ్యాం. ఆయనను ఎలాగైనా కాపాడాలని శతథా ప్రయతి్నంచాం. కానీ శరీరంలో అతివేడి కారణంగా ఆయన మూత్రపిండాలు, కాలేయం విఫలమయ్యాయి. ఇలా వెంటవెంటనే పలు అవయవాలు వైఫల్యం చెందడంతో ఆయన కన్నుమూశారు’ అని డాక్టర్‌ వివరించారు. 

ఒకే ఆస్పత్రిలో 2 గంటల్లో 16 మరణాలు 
పట్నా: ఉగ్ర ఉష్ణోగ్రత బిహార్‌లోని ఒకే ఆస్పత్రిలో 16 మంది ప్రాణాలను బలితీసుకుంది. గురువారం ఔరంగాబాద్‌లోని జిల్లా ఆస్పత్రిలో ఈ విషాద ఘటన జరిగింది. గురువారం అక్కడ 44, బుధవారం 48.2 డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ఇంతటి వేడికి తాళలేక జనం పిట్టల్లా రాలిపోయారు. చాలా మంది అక్కడి జిల్లా ఆస్పత్రిలో చేరగా గురువారం రెండు గంటల వ్యవధిలో 16 మంది చనిపోయారు.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)