Breaking News

Delhi Lodge Murder Case: హనీ ట్రాప్‌లో భాగమే..ఐతే ఆ 'సారీ నోట్‌'..

Published on Sat, 04/08/2023 - 12:19

ఢిల్లీలో తీవ్ర కలకలం రేపిన వ్యాపారవేత్త హత్య కేసులో పురోగతి సాధించారు పోలీసులు. ఆ కేసుకి సంబంధించి ప్రధాన నిందితురాలు 29 ఏళ్ల మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె హర్యానాలోని హనీ ట్రాప్‌తో దోచుకునే ముఠాకు చెందిన మహిళ అని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..బల్జీత్‌ లాడ్జిలో తన గదిలో నురగలు కక్కుతూ శవమై కనిపించిన వ్యాపరవేత్త దీపక్‌ సేథీని హనీట్రాప్‌ ప్లాన్‌తోనే హత్య చేసినట్లు తెలిపారు. సదరు మహిళ పేరు ఉషా అని ఆమె నిక్కీ, అంజలి, నిఖిత వంటి మారుపేర్లతో వ్యక్తులతో స్నేహం చేసి వారిని హోటళ్లుకు తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చి దోచుకునేదని చెప్పారు.

ఈ ప్లాన్‌తోనే ఆ రోజు కూడా ఉషా దీపక్‌ సేథీని ట్రాప్‌ చేసి హోటల్‌ల్‌కి తీసుకువెళ్లిందన్నారు. ఐతే ఆరోజు అనుకోకుండా ఓవర్‌ డోస్‌ అవ్వడంతో అతను మృతి చెందాడని తెలిపారు. దీపక్‌ సేథీ(53) మార్చి 30న రాత్రి 9.30 గంటలకు ఉషతో కలిసి గెస్ట్‌హౌస్‌కి వెళ్లిందని, అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో డబ్బు, నగలతో బయటకు వచ్చినట్లు తెలిపారు. ఐతే అనుకోకుండా దీపక్‌ చనిపోవడంతో ఆమె విచారం వ్యక్తం చేస్తూ.. 'సారీ అంటూ నోట్‌' రాసిందన్నారు. అదే ఆమెను పోలీసులకు పట్టించేలా చేసిందని చెప్పారు. ఈ ఘటనలో బాధితుడిని సంప్రదించిన ఫోన్‌ నెంబర్లలో ప్రధాన నిందితురాలితో సహా ఉన్న కొన​ఇన అనుమానిత నంబర్లను కూడా గుర్తించారు పోలీసులు.

నిందితురాలు ఉష నెంబర్‌ సంత్‌గఢ్‌ ప్రాంతంలో రీఛార్జ్‌ అవ్వడంతో ఆ లోకేషన్‌ని ట్రేస్‌ చేసి అక్కడికి చేరుకుని నైజరియన్‌ వ్యక్తి అదుపులోకి తీసుకున్నారు. అతడి లివ్‌ఇన్‌ భాగస్వామీ మధుమిత స్నేహితురాలి నిక్కీ అలీయాస్‌ ఉషా అని తేలడంతోనే ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. ఆమె 2022లో పానిపట్‌లో నమోదైన కేసులో జైలులో ఉంది. అక్కడే మధుమితతో ‍పరిచయం ఏర్పడిందని, ఆమె దీపక్‌ సేథీని ఉషకు పరిచయం చేసినట్లు తెలిపారు. విచారణలో నిందితురాలు ఉషా తనకు దీపక్‌ సేథీని చంపే ఉద్దేశ్యం లేదని, అందువల్లే ఆ గది నుంచి బయటకు వెళ్లే ముందు సారీ నోట్‌ని వదిలి వెళ్లినట్లు తెలిపింది. అలాగే ఆమె సేథీ నుంచి తీసుకున్న మొబైల్‌ ఫోన్‌, నగదు, డబ్బు తదితరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

(చదవండి: బార్‌లో సిబ్బంది, కస్టమర్ల మధ్య వాగ్వాదం..పదిమంది అరెస్టు)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)