Breaking News

అవమానించేందుకే అరెస్ట్‌ చేశారు: కేజ్రీవాల్‌

Published on Wed, 04/03/2024 - 13:51

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అరెస్ట్, ట్రయల్ కోర్టు కస్టడీ తీర్పును సవాల్ చేస్తూ మార్చి 23న అరవింద్‌ కేజ్రీవాల్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సీఎం కేజ్రీవాల్ పిటీషన్‌పై జస్టిస్ స్వర్ణకాంత శర్మతో కూడిన ఏకసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్వీ వాదనలు వినిపిస్తున్నారు. తన క్లైంట్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌కు  వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు లేవని తెలిపారు. కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేసేముందు ఆయన నివాసం వద్ద ఎటువంటి స్టేట్‌మెంట్‌ తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. అరెస్ట​కు ముందు ఈడీ అసలు అటువంటి ప్రయత్నమే చేయలేదని కోర్టుకు తెలిపారు.

అరవింద్ కేజ్రీవాల్ పారిపోయే అవకాశం ఉందా?. ఆయన ఒకటిన్నర ఏళ్లలో ఎవరైనా సాక్షిని ప్రభావితం చేయడానికి ప్రయత్నించారా?. ప్రశ్నించడానికి నిరాకరించారా? అని సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింగ్వీ ఈడీని ప్రశ్నించారు.

అంతకుముందు హైకోర్టులో హాజరుపరిచే క్రమంలో సీఎం కేజ్రీవాల్‌ మాట్లాడుతూ..‘ఎన్నికల సమయంలో నన్ను అవమానపరిచేందుకు అరెస్టు చేశారు. ఎన్నికల ప్రచారాన్ని ఆపేందుకు అరెస్టు చేశారు. ఈడీ నా నుంచి ఎలాంటి స్టెట్‌మెంట్‌ రికార్డ్ చేయలేదు’ అని అన్నారు. ఇక.. ఈడీ కస్టడీ ముగిసిన అరవింద్‌ కేజ్రీవాల్‌కు కోర్టు సోమవారం జ్యుడీషియల్‌ కస్టడీ విధించగా.. అయన్ను తీహార్‌ జైల్‌క తరలించారు. కేజ్రీవాల్‌ జ్యుడీషియల్‌ కస్టడీ ఏప్రిల్‌ 15 వరకు కొనసాగుతుంది. మార్చి 21 తేదీన సాయంత్రం ఈడీ రెండున్నర గంటల పాటు విచారించి.. అనంతరం అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)