Breaking News

లిక్కర్‌ స్కామ్‌ కేసు: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సీఎం కేజ్రీవాల్‌

Published on Mon, 07/01/2024 - 12:10

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ పాలసీ మనీ లాండరింగ్‌ కేసులో అరెస్టైన సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మరోసారి ఢిల్లీ హైకోర్టును ఆ‍శ్రయించారు.​ ఈ కేసులో సీబీఐ రిమాండ్‌, కస్టడీని సవాల్‌ చేస్తూ.. సీఎం కేజ్రీవాల్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

జూన్‌ 26న ట్రయల్‌ కోర్టు ఇచ్చిన మూడు రోజుల సీబీఐ రిమాండ్‌ను సీఎం కేజ్రీవాల్‌ సవాల్‌ చేశారు. అదే విధంగా శనివారం (జూన్‌ 29) రౌస్‌ అవెన్యూ కోర్టు.. జూలై 12 వరకు విధించిన జ్యుడీషియల్‌ కస్టడీని సవాల్‌ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

సీబీఐ ‍అభ్యర్థన మేరకు వెకేషన్‌ జడ్జి సునేనా శర్మ శనివారం సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు 14 రోజుల సీబీఐ కస్టడీ విధించారు. మూడు రోజుల సీబీఐ రిమాండ్‌ విచారణ ముగిసిన తర్వాత ట్రయల్‌ కోర్టు హాజరైన క్రేజ్రీవాల్‌ను 14 రోజుల సీబీఐ కస్టడీ విధించారు. ఈ క్రమంలో సోమవారం అరవింద్‌​ కేజ్రీవాల్ సీబీఐ రిమాండ్‌, కస్టడీపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్ కేసులో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఈడీ మార్చి 21న అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)