Breaking News

‘ఢిల్లీ లిక్కర్‌ స్కాం.. నెక్ట్స్‌ అరెస్ట్‌ అరవింద్‌ కేజ్రీవాల్’

Published on Fri, 03/10/2023 - 16:22

మనీలాండరింగ్ కేసులో శుక్రవారం ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో సుకేశ్‌ చంద్రశేఖర్ హాజరుపరిచారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సుకేశ్‌.. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తదుపరి అరెస్ట్‌ అరవింద్ కేజ్రీవాల్‌దే నంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చంద్రశేఖర్ గతంలో కేజ్రీవాల్, సిసోడియా, ఇతర ఆప్ నేతలపై పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఈడీ ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణం కేసులో దూకుడు పెంచింది.

ఈ క్రమంలో ఆప్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్ట్ కూడా చేసింది. ఈ కేసుకు సంబంధించి తరువాత అరెస్ట్‌ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ అని పేర్కొన్న చంద్రశేఖర్.. మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ పాత్ర ఉందని, త్వరలోనే అన్ని నిజాలు బయటపడతాయని తెలిపాడు. క్రిమినల్ కేసులో అరెస్టయిన తన భర్తకు బెయిల్ ఇప్పించేందుకు మల్వీందర్ సింగ్ భార్య జప్నా సింగ్‌ను రూ. 3.5 కోట్లకు మోసం చేశాడని ఆరోపిస్తూ సుకేష్ చంద్రశేఖర్ గతేడాది అరెస్టయ్యాడు. సింగ్ ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ ప్రమోటర్.

తాజాగా మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యాడు. శుక్రవారం చంద్రశేఖర్ కోర్టుకు హాజరు కాగా.. న్యాయస్థానం అతనికి మార్చి 18 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. కాగా చంద్రశేఖర్‌ మనీ లాండరింగ్‌ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం, ఈడీ దర్యాప్తులో బాలీవుడ్ నటులు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహీ, మరికొంత మంది పేర్లు బయటపడిన సంగతి తెలిసిందే.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)