Breaking News

Delhi Liquor Scam: మనీశ్ సిసోడియాకు మరోసారి సమన్లు

Published on Sat, 02/18/2023 - 13:35

న్యూఢిల్లీ: లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సీబీఐ మరోసారి సమన్లు పంపింది. డిల్లీలోని ప్రధాన  కార్యాలయంలో ఆదివారం విచారణకు రావాలని ఆదేశించింది.  సిసోడియాపై తాజాగా లభించిన ఆధారాలు చూసే ఆయనకు సీబీఐ నోటీసులు పంపినట్లు అధికారిక వర్గాలు చెప్పాయి. 

తనకు నోటీసులు పంపిన విషయాన్ని సిసోడియా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. సీబీఐ తనను మరోసారి విచారణకు పిలిచిందని పేర్కొన్నారు. కేంద్రం తన అధికారాలను ఉపయోగించి ఈడీ, సీబీఐని తనపైకి ప్రయోగిస్తోందని విమర్శించారు. 

'నా ఆఫీసు, ఇల్లు వెతికారు. బ్యాంకు లాకర్ చెక్ చేశారు. కానీ నాకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా లభించలేదు. ఢిల్లీ పిల్లలకు మెరుగైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నా. కానీ వాళ్లు నన్ను ఆపాలని చూస్తున్నారు. దర్యాప్తు సంస్థలకు ఎప్పుడూ సహకరిస్తూనే ఉన్నా. దాన్నే కొనసాగిస్తా.' అని సిసోడియా ట్వీట్ చేశారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో ముడుపులు తీసుకుని కొందరికి ప్రయోజనం చేకూర్చేలా నిబంధనలకు మార్పులు చేశారని ఆరోపణలొచ్చిన విషయం తెలిసిందే. దీనిపై గతేడాది ఆగస్టులో సీబీఐ కేసు నమోదు చేసింది. మనీశ్ సిసోడియాతో పాటు మరో 14 మందిపై వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపింది. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి విచారించింది.
చదవండి: బ్రెడ్‌ కోసం లొట్టలు వేస్తున్న భారతీయులు.. నెలకు రూ.800 వరకు ఖర్చు!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)