Breaking News

పిళ్లై ఈడీ కస్టడీ పొడిగింపు.. అదే తేదీన కవిత విచారణ

Published on Mon, 03/13/2023 - 16:27

సాక్షి, ఢిల్లీ: లిక్కర్‌ స్కాంలో నిందితుడు అరుణ్‌ రామచంద్ర పిళ్లై ఈడీ కస్టడీని ప్రత్యేక న్యాయస్థానం పొడిగించింది. మరో మూడు రోజుల పాటు పిళ్లై కస్టడీని పొడగించాలన్న ఈడీ విజ్ఞప్తిని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. దీంతో.. ఈ నెల 16వ తేదీ వరకు పిళ్లై ఈడీ అదుపులోనే ఉండనున్నారు. 

మరోవైపు 16వ తేదీనే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విచారణకు మరోసారి రావాలని ఈడీ కోరిన సంగతి తెలిసిందే. దీంతో పిళ్లైను కవితతో కలిపి మరోసారి విచారించే అవకాశం కనిపిస్తోంది. ఇక తాజాగా.. 

సంబంధిత వార్త: పిళ్లైను మేం టార్చర్‌ చేయలేదు

కవిత మాజీ ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబుకు ఈడీ సమన్లు జారీ చేసింది. 15వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. దీంతో.. బుచ్చిబాబుతోనూ పిళ్లైను కలిపి విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు ఈ కేసులో ఆప్‌ నేత మనీశ్‌ సిసోడియా సైతం ఈడీ అదుపులోనే ఉన్న సంగతి తెలిసిందే.

లిక్కర్‌ స్కాంలో పిళ్లై వాంగ్మూలం పక్కాగా నమోదు చేశామని, కానీ, ఒక బలమైన వ్యక్తికి సమన్లు జారీ చేశాకే(కవిత సమన్లను ఉద్దేశించి..) ఆయన తన వాం‍గ్మూలం వెనక్కి తీసుకుంటున్నట్లు కోర్టును ఆశ్రయించారని, పిళ్లై ఎందుకు మాట మార్చారో స్పష్టమవుతోందంటూ కోర్టులో ఈడీ వాదించింది. లిక్కర్‌ స్కాంలో మరికొంత మందికి సమన్లు జారీ చేసి.. విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని కాబట్టి పిళ్లై కస్టడీ పొడగింపు కీలకమని కోర్టుకు తెలిపింది ఈడీ. దీంతో ఈడీ వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకుని.. కస్టడీని పొడిగించింది. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)