Breaking News

ED Raids: ఆప్‌ కోసం లిక్కర్‌ స్కామ్‌ డబ్బులు?

Published on Wed, 10/04/2023 - 09:32

సాక్షి, ఢిల్లీ: లిక్కర్‌ పాలసీ కుంభకోణం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మళ్లీ దూకుడు పెంచింది. ఈ క్రమంలో మరో ఆప్‌ కీలక నేత ఇంట్లో సోదాలు నిర్వహిస్తోంది. ఈ స్కామ్‌కు సంబంధించి పలువురు అప్రూవర్‌లుగా మారారనే కథనాల నడుమ.. తాజా సోదాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే  ఎన్నికల్లో ఆప్‌ కోసం లిక్కర్‌ స్కామ్‌ డబ్బుల్నే ఉపయోగించారన్న అభియోగాలపై ఈడీ ఈ సోదాలు చేస్తున్నట్లు సమాచారం. 

ఆప్‌ ఎంపీ(రాజ్యసభ) సంజయ్‌ సింగ్‌కు చెందిన నార్త్‌ అవెన్యూ నివాసంలో బుధవారం ఉదయం ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొదటి నుంచి ఈయన ఈడీ నజర్‌లో ఉన్నప్పటికీ.. ఇప్పుడు నేరుగా నివాసాల్లో తనిఖీల దాకా వెళ్లడం గమనార్హం. ఆయన ఇంట్లో కీలక పత్రాల కోసం ఈడీ సోదాలు చేస్తున్నట్లు సమాచారం.

ఈ కేసులో ఢిల్లీ వ్యాపారవేత్త దినేష్‌ అరోరా నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. దినేష్‌ను సంజయ్‌ సింగ్‌ దగ్గరుండి మాజీ మంత్రి మనీశ్‌సిసోడియాకు కలిపించాడని ఈడీ తన అభియోగాల్లో పేర్కొంది. అంతేకాదు.. లిక్కర్ డిపార్ట్‌మెంట్‌తో దినేష్ అరోరాకు ఉన్న దీర్ఘకాలిక సమస్యను ఎంపీ సంజయ్ సింగ్ పరిష్కరించారని కూడా ఆరోపించింది. అయితే లిక్కర్‌ స్కామ్‌ కేసులో.. సంజయ్‌ సింగ్‌ పేరును మాత్రం నిందితుల జాబితాలో ఈడీ చేర్చలేదు. అయితే ఛార్జిషీట్‌లో పేరు చేర్చినప్పటికీ.. ఇప్పటిదాకా సమన్లు జారీ చేయడం గానీ, ఆయన స్టేట్‌మెంట్‌నుగానీ రికార్డు చేయలేదు. 

మనీశ్‌ సిసోడియా తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థ.. మరో ఆప్‌ నేత సంజయ్‌ సింగ్‌పై ఫోకస్‌ సారించింది. ఇదిలా ఉంటే.. మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌సిసోడియాను ఈ ఏడాది ఫిబ్రవరిలో విచారణకు పిలిచి.. అటు నుంచి అటే అరెస్ట్‌ చేసింది సీఐబీ. అంతేకాదు ఏప్రిల్‌లో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను తొమ్మిది గంటలపాటు ప్రశ్నించింది కేంద్ర దర్యాప్తు సంస్థ.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)