Breaking News

ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్‌కు దక్కని ఊరట

Published on Tue, 06/25/2024 - 14:47

ఢిల్లీ : ఢిల్లీ మద్యం పాలసీ మనీలాండరింగ్‌ కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఊరట దక్కలేదు. 

కేజ్రీవాల్‌కు బెయిల్‌ ఇస్తూ రౌస్‌ అవెన్యూ కోర్టు (ట్రయిల్‌ కోర్టు)  తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుపై ఈడీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈడీ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు  జస్టిస్ సుధీర్ కుమార్ జైన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ట్రయిల్‌ కోర్టు బెయిల్‌ ఇస్తూ తీర్పును వెలువరించగా.. ఆ తీర్పుపై స్టే విధించింది. 

ఈ సందర్భంగా సుదీర్‌ కుమార్‌ జైన్‌ ధర్మాసనం ..ట్రయిల్‌ కోర్టు ఇచ్చిన తీర్పులో లోపాల్ని ఎత్తి చూపింది. ఈడీ వాదనకు తగినంత సమయం ఇవ్వకపోవడం, మనీలాండరింగ్ నిరోధక చట్టంలో విడుదలకు సంబంధించిన షరతులను సరిగ్గా చర్చించడంలో విఫలమవడంతో పాటు ఇతర అంశాలు ఉన్నాయని స్పష్టం చేస్తూ కేజ్రీవాల్‌ బెయిల్‌పై స్టే విధించింది. దీంతో కేజ్రీవాల్‌కు హైకోర్టులో ఎదురు దెబ్బ  తగిలినట్లైంది

కేజ్రీవాల్‌కు బెయిల్‌.. అంతలోనే  
అంతుకు ముందు తనకు రెగ్యులర్‌ బెయిల్‌ ఇవ్వాలని కేజ్రీవాల్‌ జూన్‌ 20న రౌస్‌ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు కేజ్రీవాల్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్‌లో అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రమేయం నేరుగా ఉందని తెలిపేలా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కోర్టు ఆధారాల్ని అందించడంలో విఫలం కావడంతో రౌస్‌ అవెన్యూ  కోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు చేసింది. 

 సుప్రీం కోర్టులో రేపే విచారణ 
అయితే ట్రయిల్‌ కోర్టు తీర్పును ఈడీ సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ట్రయిల్‌ కోర్టు ఇచ్చిన తీర్పు హేతుబద్దంగా లేదని ఈడీ తరుపు న్యాయవాది అడిషినల్‌ సోలిసిటర్‌ జర్నల్‌ (ఏఎస్‌జీ) ఎస్‌వీ రాజు వాదించారు. ట్రయల్‌ కోర్టు తమ వాదనల్ని వినిపించేందుకు తగినంత సమయం ఇవ్వలేదని, వెంటనే ఆ ఉత్తర్వులపై స్టే విధించాలని విజ్ఞప్తి చేశారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే  విచారణ చేపట్టాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈడీ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టింది. ట్రయిల్‌ కోర్టు ఢిల్లీ సీఎంకు బెయిల్‌ ఇస్తూ తీర్పును వెలువరించిన విధానాన్ని తప్పుబట్టింది.  

కాగా, ట్రయిల్‌ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించంపై కేజ్రీవాల్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై రేపు (జూన్‌ 26న) సుప్రీం కోర్టులో విచారణకు రానుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)