Breaking News

Land for jobs scam: లాలూకు చుక్కెదురు

Published on Sat, 05/31/2025 - 14:42

న్యూఢిల్లీ: ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌(Lalu Prasad Yadav)కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌ స్కామ్‌ కేసులో ట్రయల్‌ కోర్టు విచారణ నిలుపుదల కోరుతూ ఆయన వేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఇప్పటికే ఈ అంశం ప్రత్యేక న్యాయమూర్తి ముందు వాదనలకు సిద్ధంగా ఉందని, ఈ తరుణంలో స్టే కుదరదని స్పష్టం చేసింది.

2004 నుంచి 2009 వరకు కేంద్రంలో యూపీఏ హయాంలో లాలూ రైల్వే మంత్రిగా పని చేశారు. 2008-09 మధ్య రైల్వే ఉద్యోగాలకు నియామక ప్రక్రియ జరగ్గా.. అందులో కొన్ని అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కొందరు అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు వారి నుంచి లాలూ కుటుంబం భూములు, ఇతర ఆస్తులను లంచంగా తీసుకున్నట్లు ఆరోపణలు(Land For Jobs Scam) రావడంతో సీబీఐ కేసు నమోదు చేసింది. 

ఈ అభియోగాలతో ఆయనతోపాటు మరో 15 మందిపై 2022 మే 18న సీబీఐ (CBI) కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. అదే ఏడాది అక్టోబరులో తొలి ఛార్జీషీట్‌ను దాఖలు చేయగా, 2023 జులై 3న మరో ఛార్జ్‌షీట్‌ను సమర్పించింది. ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌ స్కామ్‌ కేసును ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court) విచారణ జరుపుతోంది. ఈ కేసులో  లాలూ, ఆయన కుటుంబ సభ్యులకు ట్రయల్‌ కోర్టు గతంలో బెయిల్‌ కూడా ఇచ్చింది.  జూన్‌ 2వ తేదీన ఈ కేసులో తర్వాతి విచారణ జరగనుంది. 

ఇదీ చదవండి: మాకు నమ్మకం లేదు దొర!

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)