Breaking News

కేజ్రీవాల్‌ను మళ్లీ అరెస్ట్‌ చేస్తారా?.. ఈడీని ప్రశ్నించిన కోర్టు

Published on Wed, 08/07/2024 - 21:00

ఢిల్లీ: సీఎం అరవింద్‌  కేజ్రీవాల్‌ విషయంలో ఎన​్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)పై ఢిల్లీ హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. కేజ్రీవాల్‌ను మళ్లీ అరెస్ట్‌ చేయాలని చూస్తున్నారా? అని ప్రశ్నించింది. మీరు(ఈడీ) ఏం చేయాలనుకుంటున్నారు అని అడిగింది.

కాగా, ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ట్రయల్‌ కోర్టుకు ఇచ్చిన బెయిల్‌ను ఈడీ సవాల్‌ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఇక, ఈడీ పిటిషన్‌పై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నీనా బన్సల్ మాట్లాడుతూ..‘కేజ్రీవాల్‌ విషయంలో నేను అయోమయంలో ఉన్నాను. మీరు అసలు ఏం చేయాలనుకుంటున్నారు. కేజ్రీవాల్‌ను మళ్లీ అరెస్టు చేయాలనుకుంటున్నారా?’ అంటూ ప్రశ్నించారు. అనంతరం విచారణను సెప్టెంబర్‌ ఐదో తేదీకి వాయిదా వేసింది.

ఇదిలా ఉండగా..మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఎ) కేసులో కేజ్రీవాల్‌కు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు జూన్‌ 20న బెయిల్‌ మంజూరు చేసింది. కాగా రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వును ఢిల్లీ హైకోర్టు నిలిపివేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) వాదనలను వినే వరకు కేజ్రీవాల్‌కు కల్పించిన బెయిల్‌ ఉపశమనంపై మధ్యంతర స్టే విధించిన విషయం తెలిసిందే. 
 

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)