Breaking News

కేజ్రీవాల్‌ కోర్టు వీడియో తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం

Published on Sat, 06/15/2024 - 11:40

ఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసు​లో అరెస్టైన అరవింద్‌ కేజ్రీవాల్‌.. కోర్టులో మాట్లాడిన వీడియోను సోషల్‌ మీడియా అకౌంట్స్‌ నుంచి వెంటనే  తొలగించాలని సునీతా కేజ్రీవాల్‌ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. మనీలాండరింగ్‌ కేసులో అరవింద్‌ కేజ్రీవాల్‌ను కోర్టులో ప్రవేశపెట్టినప్పడు ఆయన భార్య సునీతా కేజ్రీవాల్‌.. కోర్టు ప్రొసిడింగ్స్‌ జరిగిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ విషయంలో న్యాయవాది వైభవ్‌ సింగ్‌ వేసిన పిల్‌పై శనివారం ఢిల్లీ హైకోర్టు స్పందించింది. 

ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన వీడియో రికార్డింగ్.. కోర్టు ప్రొసిడింగ్స్‌ను  ఉల్లంఘించనట్లు అవుతుందని కోర్టు పేర్కొంది. సునితా కేజ్రీవాల్‌ సంబంధిత వీడియోను డిలీట్‌ చేయాలని, అదే విధంగా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ సైతం రీపోస్ట్‌ అయిన ఆ వీడియోను వెంటనే తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  సునితా కేజ్రీవాల్‌తో పాటు వీడియో పోస్ట్‌ చేసిన మరో ఐదుగురికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ పిల్‌పై జూలై 9న విచారణ చేపడతామని ఢిల్లీ హైకోర్టు తెలిపింది.

అరవింద్‌ కేజ్రీవాల్‌ను మార్చి 28 ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో వీడియో కాన్ఫరెన్స్‌  ద్వారా ప్రవేశపెట్టారు. వీడియో  కాన్ఫరెన్స్‌ను రికార్డ్‌ చేసిన  సునితా కేజ్రీవాల్‌ ఆ వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్‌చేశారు. అయితే ఇలా చేయటం కోర్టు ప్రొసిడింగ్స్‌ను ఉల్లంగిండమవుతుందని ఢిల్లీ హైకోర్టు తప్పు పట్టింది.

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)