Breaking News

వాహనదారులకు అలర్ట్‌.. ఏప్రిల్‌ ఒకటి నుంచి కొత్త రూల్‌

Published on Sun, 03/02/2025 - 07:29

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో కాలుష్యాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. కాలం చెల్లిన వాహనాలకు ఇంధనం విక్రయించకుండా నిబంధన విధించింది. ఇది ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.

కాగా, పెట్రోల్‌ వాహనాలు 15 ఏళ్లు, డీజిల్‌ వాహనాలు పదేళ్లు దాటితే ఇంధనం విక్రయించే ప్రసక్తే లేదని శనివారం తేల్చి చెప్పింది. వాహనాల గడువు తీరిపోయిందో లేదో తెలుసుకునేందుకు పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని పెట్రోల్, డీజిల్‌ పంపుల యాజమాన్యాలకు సూచించింది. కాలుష్య నియంత్రణపై శనివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కాలం చెల్లిన వాహనాలకు ఇంధనం విక్రయించకూడదని నిర్ణయించినట్లు ఢిల్లీ పర్యావరణ శాఖ మత్రి మంజీందర్‌ సింగ్‌ సిర్సా వెల్లడించారు. ఈ విషయాన్ని త్వరలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయు శాఖకు తెలియజేస్తామని పేర్కొన్నారు.

గడువు తీరిపోయిన వాహనాలు రోడ్లపైకి రాకుండా నిరోధించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టంచేశారు. ఢిల్లీలో 425కుపైగా ఇంధన బంకులు ఉన్నాయి. నగరంలో కాలం చెల్లిన వాహనాలు 55 లక్షలు ఉన్నట్లు అంచనా. ఇందులో 66 శాతం ద్విచక్ర వాహనాలు, 54 శాతం నాలుగు చక్రాల వాహనాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి మొత్తం ప్రజా రవాణా బస్సుల్లో 90 శాతం సీఎన్‌జీ బస్సులనే ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)