Breaking News

ఢిల్లీలో మళ్లీ భారీ వర్షం..స్తంభించిన జనజీవనం

Published on Sat, 07/15/2023 - 19:25

సాక్షి, ఢిల్లీ: నాలుగు రోజుల తర్వాత ఢిల్లీలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. శనివారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో మొదలైన వర్షం.. గట్టిగానే దంచి కొడుతోంది. దీంతో.. ఇప్పడిప్పుడే బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్న జనం మళ్లీ ఇంటి వైపు పరుగులు పెడుతున్నారు. ఈ పరిస్థితితో ఇప్పటికే వరద గుప్పిట ఉన్న ఢిల్లీ కోలుకునేందుకు ఇంకాస్త సమయం పట్టేదిగా కనిపిస్తోంది. 

ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు.. పైగా యమునా నదీకి ఎగువ నుంచి వచ్చి చేరిన వరదతో దేశ రాజధాని ప్రాంతం నీట మునిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓవైపు వర్షం ఆగిపోయినప్పటికీ.. అప్పటికే పోటెత్తిన వరద యమునా నదిని డేంజర్‌ జోన్‌కి నెట్టేసింది. దీంతో నదీ తీర ప్రాంతం నుంచి జనాల్ని సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరించింది ఢిల్లీ ప్రభుత్వం. ఈలోపు నగరం కూడా నీట మునిగి.. మొత్తం జనజీవనంపై ప్రభావం పడింది. మునుపెన్నడూ చూడని దృశ్యాలకు హస్తిన వేదికైంది.

ఇక సహాయక చర్యల్లో భాగంగా రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌ నడుం లోతు వరద నీటి నుంచి జనాలను, మూగ జీవాల్ని తరలిస్తూ వస్తోంది. ఈలోపు వరద క్రమంగా తగ్గుముఖం పడుతుండడం.. యమునా నదీ ఐదు సెంటీమీటర్ల ప్రవాహం తగ్గడంతో పరిస్థితి సాధారణం వైపు వెళ్తోందని అంతా ఆశించారు. కానీ, తాజాగా మళ్లీ వర్షం కురుస్తుండడంతో మళ్లీ నగర వాసుల్లో ఆందోళన పెరిగిపోతోంది.  చాలావరకు వీధుల్లో ఇప్పటికీ నీరు అలాగే నిలిచి ఉండడం గమనార్హం. ఇంకోవైపు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్‌ జారీ చేసింది.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి