Breaking News

ఢిల్లీ లిక్కర్‌ కేసు: సుప్రీం కోర్టులో కేజ్రీవాల్‌కు దక్కని ఊరట

Published on Mon, 06/24/2024 - 12:51

ఢిల్లీ:  ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించలేదు.  

ఇటీవల  రౌస్‌ అవెన్యూ  ట్రయల్‌ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే   ఇ‍వ్వడాన్ని కేజ్రీవాల్‌లో సుప్రీం కోర్టులో సవాల్‌ చేశారు. అయితే ఈ పిటిషన్‌పై సోమవారం సుప్రీం కోర్టు విచారణ జరిపి..  ఢిల్లీ హైకోర్టు సంపూర్ణ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాతే దానిపై పరిశీలన చేస్తామని పేర్కొంది. తీర్పు కాపీ చూడకుండా ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు తెలిపింది. ఇక.. తదుపరి విచారణను జూన్‌ 26కు వాయిదా వేసింది.

ఇటీవల ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు రౌస్‌ అవెన్యూ ట్రయల్‌ కోర్టు.. సాధారణ బెయిల్ మంజూరు చేసింది. ల‌క్ష రూపాయ‌ల పూచీక‌త్తు బాండ్‌ స‌మ‌ర్పించాల‌ని కోర్టు ష‌ర‌తు విధించింది. అయితే అప్పీల్‌కు వెళ్లేంత వ‌ర‌కు తీర్పును 48 గంట‌ల‌పాటు స‌స్పెండ్ చేయాల‌ని ఈడీ కోరిన్ప‌టికీ కోర్టు తిర‌స్క‌రించింది.  

ఇక.. ట్రయల్‌ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై దర్యాప్తు  సంస్థ ఈడీ స్టే విధించాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ట్రయల్‌ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు స్టేపై నిన్న(ఆదివారం) సీఎం కేజ్రీవాల్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)