Breaking News

Exit Polls: ఢిల్లీలో అంచనాలు తప్పేనా?

Published on Thu, 02/06/2025 - 11:00

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌ చాలావరకు బీజేపీకే అనుకూలంగా వచ్చాయి. సుమారు 27 ఏళ్ల తర్వాత హస్తినలో కమలం వికసించబోతోందని, నాలుగోసారి ముఖ్యమంత్రి ప్రమాణం చేయాలనుకుంటున్న అరవింద్‌ కేజ్రీవాల్‌కు‌ నిరాశ తప్పదని అంచనా వేశాయి. అయితే.. ఆప్‌ మాత్రం ‘హ్యాట్రిక్‌’ విజయంపై ధీమాతోనే ఉంది. 

ఢిల్లీ ఎగ్జిట్‌ పోల్స్‌(Delhi Exit Polls)ను ఆప్‌ తిరస్కరిస్తోంది. ప్రజాభిప్రాయాన్ని ఎగ్జిట్‌పోల్స్‌ ప్రతిబింబించవని చెబుతోంది. ఎగ్జిట్‌ పోల్స్‌  ఆప్‌ విషయంలో ఎప్పుడూ తప్పాయని, కాబట్టి ఈసారి కూడా అదే జరగబోతోందని చెబుతోంది. అంతేకాదు.. గతంలో ఆ అంచనాలు తప్పిన సందర్భాలనూ సైతం ప్రస్తావిస్తోంది.

‘‘ఈ ఎగ్జిట్‌ పోల్స్‌(Exit Polls)ను మా పార్టీ ఖండిస్తోంది. గత నాలుగు ఎన్నికల్లోనూ ఢిల్లీలో ఆప్‌ అధికారానికి దూరంగా ఉంటుందంటూ పేర్కొన్నాయి. ఎన్నడూ కేజ్రీవాల్‌ పార్టీ అధికారం చేపడుతుందని చెప్పలేదు. కానీ, వాస్తవానికి జరిగింది ఏంటి?. రెండుసార్లు ఆప్‌ అధికారాన్ని చేపట్టింది’’ అని ఆప్‌ నేత సుశీల్‌ గుప్తా వ్యాఖ్యానించారు. మరోవైపు బీజేపీ మాత్రం ఎగ్జిట్‌పోల్స్‌ నివేదికలతో ఫుల్‌ జోష్‌లో ఉంది.  

బుధవారం(ఫిబ్రవరి 5వ తేదీన) ఢిల్లీ అసెంబ్లీ 70 స్థానాలకు పోలింగ్‌ జరిగింది.  దాదాపు సర్వే సంస్థలన్నీ బీజేపీదే విజయమని చెబుతున్నాయి. అయితే.వీప్రిసైడ్‌(Weepresie), మైండ్‌ బ్రింక్‌లు మాత్రం ఆప్‌ గెలవొచ్చని అంచనా వేస్తున్నాయి. ఇక.. కాంగ్రెస్‌ సున్నా నుంచి 3 సీట్లలోపే పరిమితం కానుందని చెప్పాయవి. అయితే ఎగ్జిట్‌పోల్స్‌పై కాంగ్రెస్‌ స్పందించాల్సి ఉంది.

అధికారంపై బీజేపీ ఆశలు
1993లో బీజేపీ తొలిసారి మదన్ లాల్ ఖురానా నేతృత్వంలో ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెండేళ్ల తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత నేపథ్యంలోఆయన్ని తప్పించి.. సాహిబ్ సింగ్ వర్మ ముఖ్యమంత్రిని చేసింది కమల అధిష్టానం. రెండున్నరేళ్ల తర్వాత.. చివర్లో సుష్మా స్వరాజ్‌ను సీఎం చేశారు. ఆ తర్వాత ఆమె నేతృత్వంలో 1998లో ఎన్నికలకు వెళ్లిన బీజేపీకి ఘోర పరాజయం ఎదురైంది. అప్పటి నుంచి మూడు పర్యాయాలు షీలా దీక్షిత్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో కొనసాగింది. 

ఆ తర్వాత 2013 ఎన్నికల్లో ఆప్‌(AAP) విజయం కైవసం చేసుకోగా.. 48 రోజుల కేజ్రీవాల్‌ పాలన తర్వాత రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది. ఏడాది తర్వాత.. 2015 ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో తిరిగి ఆప్‌ ఘన విజయం సాధించింది. అప్పటి నుంచి అధికారంలో ఆప్‌ కొనసాగుతూ వచ్చింది. అయితే.. ఎన్నికల్లో  కేజ్రీవాల్ మద్యం కుంభకోనం ఆరోపణలు రావడం, కేంద్రంలోని బీజేపీ కక్ష సాధింపుతో వేధిస్తుందని ఆప్ పదే పదే విమర్శించడం, రాష్ట్రంలో పరివర్తన్ వచ్చి ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ రావాలని బీజేపీ పిలుపు ఇవ్వడం.. ఈసారి ఎన్నికలపై ప్రభావం చూపేలా కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 8వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కౌంటింగ్‌.. అదే రోజున ఫలితాలు వెల్లడి కానున్నాయి.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)