Breaking News

లిక్కర్‌ స్కాంలో ఆప్‌ ఎంపీ సంజయ్‌కు మరో షాక్‌..

Published on Thu, 10/05/2023 - 19:47

ఢిల్లీ: దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. కాగా, ఈడీ సంజయ్‌ సింగ్‌ను కోర్టులో హాజరుపరచడంతో న్యాయస్థానం ఐదు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం రౌస్‌ అవెన్యూ కోర్టు సంజయ్‌ సింగ్‌ను ఈ నెల 10 వరకు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

వివరాల ప్రకారం.. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో అరెస్ట్‌ అయిన ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ను కోర్టు ఐదు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. బుధవారం సంజయ్‌ను అధికారులు కోర్టులో హాజరు పరచగా.. ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం రౌస్‌ అవెన్యూ కోర్టు ఆయన్ను ఈ నెల 10 వరకు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తొలుత ఈడీ అధికారులు సంజయ్‌ సింగ్‌ను పది రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ వాదనలు వినిపించారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన వ్యాపారవేత్త దినేశ్‌ అరోరా.. సంజయ్‌కు డబ్బులు ఇచ్చినట్టు రికార్డు చేసిన వాంగ్మూలాన్ని కోర్టుకు సమర్పించారు. దీనికి సంబంధించిన డిజిటల్‌ ఆధారాన్ని సైతం స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 

మరోవైపు, ఈడీ అధికారులు సంజయ్‌ సింగ్‌ను అవమానించేందుకే అరెస్టు చేశారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈడీ అరెస్టు చేసిన దినేశ్ అరోడా అప్రూవర్‌గా మారారని.. ఈ కేసులో ముందుగా ఎప్పుడూ సమన్లు కూడా ఇవ్వలేదని వాదించారు. ఇదిలా ఉండగా.. త‌న అరెస్ట్‌కు ముందు ఆప్ ఎంపీ సంజయ్‌ సింగ్‌ ఒక వీడియో సందేశాన్ని రికార్డు చేశారు. అవినీతికి వ్యతిరేకంగా తన పోరాటం కొనసాగుతుందని అందులో పేర్కొన్నారు. చావనైనా చస్తాను కానీ, తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

అదానీ స్కామ్‌లను తాను బహిర్గతం చేశానని, ఈడీకి ఫిర్యాదులు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి ఓటమి తప్పదని, దాడులు, అరెస్టులు వంటి వాటి ద్వారా విజయం సాధించలేరని స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఈడీ తనను బలవంతంగా అరెస్టు చేస్తున్నదని చెప్పారు. తనపై చేసినవన్నీ నిరాధార, తప్పుడు ఆరోపణలేనన్నారు. ఇలాంటి వాటికి భయపడబోమని.. పోరాటం చేస్తామని చెప్పారు. 

ఇది కూడా చదవండి: రాహుల్‌ గాంధీపై బీజేపీ వివాదాస్పద ఫొటో.. రావణుడితో పోల్చి..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)