Breaking News

నిరసనల్లో చేయి చేసుకున్న అదనపు డీసీపీపై వేటు

Published on Thu, 07/23/2026 - 11:42

న్యూఢిల్లీ: పార్లమెంట్ మార్చ్ సందర్భంగా నిరసన తెలియజేస్తున్న ఓ మహిళపై చేయి చేసుకున్న ఢిల్లీ పోలీసు అదనపు డీసీపీ సందీప్ లాంబాపై వేటు పడింది. జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళన ప్రాంతం నుంచి ఆయనను తక్షణమే తొలగిస్తూ ఢిల్లీ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. జులై 20వ తేదీన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) ఆధ్వర్యంలో పార్లమెంట్ ముట్టడికి భారీగా నిరసనకారులు తరలివచ్చారు. ఈ క్రమంలో జరిగిన తోపులాట, ఉద్రిక్త పరిస్థితుల నడుమ నూఢిల్లీలోని పార్లమెంట్ కాంప్లెక్స్ సమీపంలో పరుగెత్తుతున్న ఓ మహిళపై అదనపు డీసీపీ సందీప్ లాంబా చేయి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన 36 సెకండ్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఈ ఘటనపై ఢిల్లీ హైకోర్టులోనూ విచారణ జరిగింది. నిరసనకారుల తరపున వాదించిన సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ యూనిఫామ్‌లో ఉన్న వ్యక్తుల దౌర్జన్యాలను ఉపేక్షించకూడదని, ఆ అధికారిని కోర్టుకు పిలిపించి బాధ్యత వహించేలా చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. మరోవైపు, తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ సాకేత్ గోఖలే కూడా ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. ఆ మహిళ చేతిలో మేకులు లాంటి వస్తువు ఉందని, ఎంత చెప్పినా అక్కడి నుంచి వెళ్లకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగిందని, దీంతో ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతోనే ఆ అధికారి ఆ విధంగా ప్రవర్తించారని ఒక డీసీపీ స్థాయి అధికారి తెలిపారు. మహిళా నిరసనకారులతో వ్యవహరించేటప్పుడు సంయమనం పాటించాలని ఆయనకు సూచించినట్లు పేర్కొన్నారు. మరోవైపు జూలై 20 నాటి ఆందోళనల్లో భారీగా జనం గుమికూడటంతో పోలీసులు లాఠీచార్జి చేసి, బాష్పవాయువు ప్రయోగించారు. ఈ నిరసనలకు సంబంధించి రాజకీయ నాయకుల నిరసనలు, అరెస్టుల పర్వం కూడా కొనసాగుతోంది.
 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)