Breaking News

మహిళలకు నెలకు రూ.2500.. ఢిల్లీ సీఎం కీలక వ్యాఖ్యలు

Published on Mon, 02/24/2025 - 12:45

న్యూఢిల్లీ: ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలి అసెంబ్లీ సమావేశాలు సోమవారం(ఫిబ్రవరి 24)ప్రారంభమయ్యాయి. తొలి సమావేశాల్లో సీఎం రేఖాగుప్తా సహా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు. ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్‌)తరపున ప్రతిపక్ష నేతగా మాజీ సీఎం అతిషి ఎన్నికైన విషయం తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా మహిళలకు నెలకు రూ.2500 నగదు ఇచ్చే అంశంపై సీఎం రేఖాగుప్తా కీలక ప్రకటన చేశారు. 

తమ ప్రభుత్వ ప్రాధాన్యం మహిళలకు నెలకు రూ.2500 స్కీమ్‌ అమలు చేయడమేనని సీఎం రేఖాగుప్తా అన్నారు. అయితే గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి వెళ్లిపోయినందున స్కీమ్‌ అమలు కొంత ఆలస్యం జరగొచ్చని పరోక్ష సంకేతాలిచ్చారు. దీనిపై  ప్రతిపక్ష నేత అతిషి అభ్యంతరం తెలిపారు. తాము మంచి స్థితిలో ఉన్న ప్రభుత్వాన్ని అప్పగించామని కౌంటర్‌ ఇచ్చారు.

అయితే సీఎంగా రేఖాగుప్తా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత నిర్వహించిన క్యాబినెట్‌ భేటీలో మహిళలకు రూ.2500 బదిలీ పథకంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ఆమ్‌ఆద్మీపార్టీ విమర్శలు చేసింది. ఎన్నికల హామీలను విస్మరించారని మాజీ సీఎం అతిషి ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు పెట్టారు. తొలి రోజే తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడంపై సీఎం రేఖాగుప్తా ఆప్‌పై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో మహిళలకు నగదు బదిలీపై ఢిల్లీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)