Breaking News

అతిషికి సీఎం రేఖా గుప్తా కౌంటర్‌

Published on Fri, 02/21/2025 - 12:16

న్యూఢిల్లీ: ఢిల్లీ కొత్త సీఎం రేఖా గుప్తా మాజీ సీంఎ అతిషికి గట్టి కౌంటర్‌ ఇచ్చారు. ఢిల్లీలో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం ఎన్నికల హామీలను మర్చిపోయిందంటూ అతిషి చేసిన విమర్శలకు ఘాటుగా సమాధానమిచ్చారు. ‘ఢిల్లీని కాంగ్రెస్‌ 15 ఏళ్లు, ఆప్‌ 13 ఏళ్లు పాలించాయి. ఇన్ని సంవత్సరాల పాలనలో వాళ్లేం చేశారు. మేం వచ్చి ఒక్కరోజే అయింది. 

తొలి రోజే నేను సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే క్యాబినెట్‌ మీటింగ్‌ పెట్టి ఢిల్లీ ప్రజలకు రూ.10 లక్షల రూపాయల ఆయుష్మాన్‌ బీమా యోజన వర్తించేలా ఆదేశాలిచ్చాం. వాళ్లకు మమ్మల్ని ప్రశ్నించే అర్హత లేదు. వాళ్లు ముందు వారి పార్టీని సరిగా చూసుకోవాలి. చాలా మంది పార్టీని వదిలేందుకు సిద్ధమవుతున్నారు.

గత ప్రభుత్వ అక్రమాలపై కాగ్‌ రిపోర్ట్‌ బయటపెడతామని ‘ఆప్‌’ భయపడుతోంది’అని అతిషికి సీఎం రేఖ కౌంటర్‌ ఇచ్చారు. కాగా, కొత్త ప్రభుత్వం తొలి క్యాబినెట్‌‌ సమావేశంలో ఢిల్లీ మహిళలకు నెలకు రూ.2500 ఇచ్చే హామీ అమలును మరిచిపోయిందని అతిషి గురువారం ఎక్స్‌(ట్విటర్‌)లో విమర్శించిన విషయం తెలిసిందే.

 

 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)