Breaking News

తీహార్‌ జైల్లో లొంగిపోయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌

Published on Sun, 06/02/2024 - 19:40

సాక్షి, ఢిల్లీ: తీహార్‌ జైల్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ లొంగిపోయారు. మధ్యంతర బెయిల్‌ ముగియడంతో జైల్లో ఆయన లొంగిపోయారు. మద్యం పాలసీ కేసుపై దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఏప్రిల్‌లో ఆయనను అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం కోసం 21 రోజుల మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు మే 10న మంజూరు చేసింది. ఆదివారంతో బెయిల్‌ గడువు ముగిసింది. బెయిల్‌ పొడిగింపు అభ్యర్థనను కోర్టు నిరాకరించడంతో ఈ క్రమంలో అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం సాయంత్రం తీహార్‌ జైలులో లొంగిపోయారు.

కాగా, అంతకుముందు కేజ్రీవాల్‌ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు సందేశం ఇస్తూ.. ‘‘సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేను 21 రోజుల పాటు ఎన్నికల ప్రచారానికి వచ్చాను. ఈ అవకాశం ఇచ్చిన న్యాయస్థానానికి కృతజ్ఞతలు. ఈరోజు తిరిగి లొంగిపోతానని తెలిపారు.

‘‘మధ్యాహ్నం 3 గంటలకు ఇంటి నుండి బయలుదేరి రాజ్‌ఘాట్‌లోని మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులర్పిస్తాను. అనంతరం హనుమాన్ ఆలయానికి వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటాను. అక్కడ నుంచి పార్టీ కార్యాలయానికి వెళ్లి నేతలను, కార్యకర్తలను కలిసి తీహార్‌కు వెళ్తా. మీరు ఇక్కడ సంతోషంగా ఉంటేనే మీ సీఎం జైల్లో ఆనందంగా ఉంటాడు’’ అంటూ ట్వీట్‌ చేశారు.

 


 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)