ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్
Breaking News
లిక్కర్కేసు: సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు దక్కని ఊరట
Published on Wed, 08/14/2024 - 07:34
న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీపార్టీ చీఫ్ కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం(ఆగస్టు14) విచారించింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్భూయాన్లతో కూడిన బెంచ్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. రెగ్యులర్ బెయిల్ మీద కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి నోటీసులు జారీ చేసి విచారణను వాయిదా వేసింది.
లిక్కర్‌కేసులో ఈ ఏడాది మార్చి21న అరెస్టయిన కేజ్రీవాల్‌కు మనీలాండరింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇప్పటికే బెయిల్ మంజూరు చేసింది. అయితే సీబీఐ అవినీతి కేసులో మాత్రం కేజ్రీవాల్ ఇంకా తీహార్జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఇదే కేసులో 17 నెలలు రిమాండ్‌లో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆమ్ఆద్మీపార్టీ సీనియర్ నేత మనీష్‌సిసోడియాకు ఇటీవలే సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
Tags : 1